పుట:Bhaarata arthashaastramu (1958).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 సమవృద్ధి లేక యథాక్రమవృద్ధి

10 రూపాయలు వినియోగించిన 20 పుట్లు

20 రూపాయలు వినియోగించిన 40 పుట్లు

40 రూపాయలు వినియోగించిన 80 పుట్లు

ఇట్లే యధాక్రమముగ వృద్ధియౌననుట యూహ్యంబు.

3 హీనవృద్ధి

ఈ తఱిని నేల నిస్సారత్వము నొందినదిగాన

10 రూపాయలకు 20 పుట్లు

20 రూపాయలకు 35 పుట్లు

40 రూపాయలకు 60 పుట్లు

ఇట్లే తదితరముల గ్రహించునది.

హీనవృద్ధియనఁగా వృద్ధిలేకపోవుటయని యర్థంబుగాదు యథాక్రమమునకైనఁ దక్కువగా వృధియగుననుట. మొత్తములో క్షయమనుటగాదు. సామ్యములో క్షయమనుట. ఇది మఱవక గమనించ వలయును.

ఈ న్యాయములనే యింకొక తీరున నిర్వచింపనగును. అధిక వృద్ధికాలములో రాశి యెక్కువయగుకొలది ప్రతిభాగమునకునై పడెడు శ్రమయో వ్యయమో తక్కువయగును.

ఎట్లన మీది నిదర్శన ప్రకారము.

తొలుత ఒకపుట్టికి సెలవు 1/2 రూపాయ. 8 అణాలు

ఉత్పత్తి యెక్కువకాగా ఒకపుట్టికి ర్పూ 20/80 = 6 చిల్లర అణాలు.

తుదకు ర్పూ 40/110 = 4/11 = 1/3 = 5 చిల్లర అణాలు.

సమవృద్ధి కాలములో రాశి యెట్లున్నను ప్రతిభాగము యొక్కయు విలువ మారుటలేదు. స్పష్టము.

హీనవృద్ధిదశలో రాశి యధికముగఁ జేయవలయునన్న ప్రతి భాగముయొక్క వెలయు నధికమగును. ఎట్లన్న ఉదాహృత నిదర్శన ప్రకారము.