పుట:Bhaarata arthashaastramu (1958).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమానము, క్లేశకరము. వస్త్వాదర మనునది వస్తువులవలన గలుగు సుఖమునుండి తత్ప్రాప్తికై పడవలసిన దు:ఖమును దీసివేయగా నిలిచిన సుఖభావము.

సుఖమునుండి

దు:ఖముపోగా

నిలిచిన ఖరారు సుఖము = వస్తుపార్జన చోదకాదరము. అట్లగుట సుఖము ముందున్న రీతినే యున్నను దు:ఖము క్షయించిన నిశ్చిత సుఖము వృద్ధియగుననుట యప్రతిహత న్యాయము.

1. ఇట్లు ధరలును ఉపయోగములును బరస్పరాశ్రయములై యుండగా ధరలను గొలతగా జేయుటయెట్లు? బట్టలను గజము కొయ్యతో గొలుతుము. ఈ గజముకొయ్య యొక పొడుగుగలదిగా లేక బట్టయొక్క నిడివికొలది విశ్వరూపమును వహించునదియైన దానితో గొలుచుటకు బ్రహ్మదేవునకైన నలవియా?

2. మఱియు రూప్యములును వస్తువులే. వస్తువు లెట్లు రాశి ననుసరించిన విలువగలవిగా నున్నవో యట్లే యవియును సంఖ్యా సమాశ్రితమైన మూల్యముగలవిగా నున్నవి. బంగారు విశేషముగ దేశమున నుపగతమైన బంగారముయొక్క విలువ పలుచబడును. రూప్యములు శాశ్వతమును నిర్వికారమునైన యంత్యోపయుక్తి గలవికావు.

3. సరకులరీతినే నాణెములును బ్రతిమనుజుని ప్రాప్తికొలది లఘువులో గురువులోయైయున్నది. బీదవాడు రూపాయను వరహాగా జూచును. వానికి దానియందలి యంతోపయుక్తి మహాఘనము. కోటీశ్వరుడు వరహాను దమ్మిడిగ బాఱవేయును. వానికి దానియందలి యంత్యానురాగ మించుమించు పూజ్యము. కావున బీదవాడు రూపాయకు గొను వస్తువునే మహారాజైనవాడు పది రూపాయలు లెక్కపెట్టియు బెట్టక వేసికొనుటయుం గలదు. కావున ధరలు చంచలములు. ధరలతో నుపయుక్తతం గొలుచుట యసాధ్యం. అంతకన్న మెఱుగు దీగలతో దులల దీర్చుట సుఖము.