పుట:Andhrula Charitramu Part 2.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నకొడుకగు అమ్మరాజవిజయాదిత్యుడును అగు పూర్వచాళుక్యులని పై శాసనములనుబట్టి స్పష్టమగుచున్నది.[1] మరియు నా శాసనములలో అమ్మరాజవిజయాదిత్యుని తండ్రియగు రెండవ చాళుక్య భీమ విష్ణువర్ధనుడు తన దాయాదులయిన యుద్ధమల్లుడు, రాజమార్తాండుడు, కంఠికివిజయాదిత్యుడు మొదలగు వారితో యుద్ధముచేసి రాజమార్తాండుని సంహరించి తక్కినవారిని దేశమునుండి తరుమగొట్టెనని చెప్పబడినది. పై నుదాహరింపబడిన వారిలో కంఠికివిజయాదిత్యుడే బేటవిజయాదిత్యుడనువాడు. ఈ బేటవిజయాదిత్యుడు తన తండ్రియైన అమ్మరాజ విష్ణువర్ధనునకు వెనుక క్రీ.శ.915వ సంవత్సరమున రాజ్యభారమును వహించియు, యుద్ధమల్లునికొడుకయిన తాళరాజుచే బదభ్రష్టుడయ్యెను. ఇతని కొడుకు సత్యాశ్రయుడు. ఇతడు చక్రవర్తి పదము బడయకపోయినను, మహామండలేశ్వరుడుగనుండి వేంగీదేశములో గొంతభగమును బరిపాలించుచుండెను. క్రీ.శ.925_40 సంవత్సరముల ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభవకావ్యమున నీ క్రింది పద్యములో బేర్కొనియున్నాడు.

“క. మును మార్గకవితలోకం
బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున
జన సత్యాశ్రయుని దొట్టి చాళుక్యనృపుల్.“

దీనింబట్టి నన్నయభట్టారకునకు నూరేండ్లకుబూర్వమే యాంధ్రకవితాసతి వర్ధిల్లుచున్నదని స్పష్టమగుచున్నది. ఈ పై పద్యమునందుజెప్ప

  1. Ep.Ind.Vol.ix., pp.47 to 56; Copper Plate No.19, Nellore. Inscriptions Part I.p.164; Annual Report on Epigraphy No.655, Public, 28th July 1910 para 10.