పుట:Andhrula Charitramu Part 2.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సానికిని బుట్టినకన్నమనాయని వైష్ణవునిగ జేసి జ్యేష్టపుత్రునిభాతి బెంచు కొన్నట్లుగ వీరచరిత్రమున జెప్పబడినది. కార్యమపూడిరనరంగమును బరీక్షించుటకై బ్రహ్మనాయనిచే బంపబడిన కన్నమనాయుడచ్చటి యెఱుకల సానితో,

          "మాలలకునుబుట్టి మాలనైపోక
            విష్ణుపాదముబట్టి విశ్వంబ్ను లోన
            దెప్పలినాయుడు తెఱవ యైనట్టి
            యంబుజలోచన పెమ్మసానికిని
            శ్రీమించు మాచెర్లచెన్నుని మేన
            బెంపొందెడుతులసి పెదవనమాల
            వరమునగన్నట్టి వరపుణ్యసుతుడ
           గన్నమనాపేరు గమలాక్షి వినవె"

       అని తన యుదంతమును జెప్పుకొని యున్నాడు. కారెముపూడియందు మలెదేవభూపతి బ్రహ్మనాయుడు మొదలగువారు కోటకేతరాజు మొదలగు రాయబారులతో సంధికార్యమునగూర్చి ప్రసంగించు సభలో గన్నమనాయుడు మొదలగు గొసంగులు కూర్చుండి యుండగా వీరమేడపినుండివచ్చి బాలనాయుడు సభాస్తారులను ద్రొచుకొని రాజుసమ్ముఖమునకు బోవునపుడు మాలకన్నమనాయ డడ్దుపడి వానితో గొంత ప్రసంగము జేసెను. అప్పుడు,

     "బ్రహ్మనాయుడు నీకు బాంధవు డెట్లో?
       వినిపింపు కన్నమ వివరంబు గాగ"
అని బాలనాయుడు ప్ర్రశ్నింపగా నతడు:-
      "నాయుడు విష్ణువు నారాయణుండు
        ప్రకటదయాంబుధి వరము లొసంగె
        దగ జనించితి నేనుఇ దల్లిగర్భమున
        బరమపావనమూర్తి బ్రహ్మనాయనికి