పుట:Andhrula Charitramu Part 2.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మార్కొని యతిభయంకర మైన యుద్ధము జేసిరి. పేరినీడు శత్రుసైన్యము నోడించెను గాని సన్నగండ్లకడ మరణము నొందెను.మాలకన్నమనాయని నల్వురు సోదరులు చింతపల్లికడ యుద్ధములో జచ్చిరి. ఉభయపక్షములందును వీరేనాయకు లనేకులు వీరస్వర్గమును జూఱ కొనిరి. తుదకు బ్రహ్మనాయని ప్రియశిష్యు డగు మాలకన్నమనాయనతోడి పోరాటమున నాయకురా లపజయమును బొందుటయే గాక వానిచేతికి జిక్కెను. అంతట కన్నమనాయుడు నాయకురాలిని కాళ్లుసేతులు బంధించి బ్రహ్మనాయని కడకు గొనివచ్చెను.

                        యుద్ధసమాప్తి.
   నాయకురాలు బ్రహ్మనాయనిచే జిక్కినతరువాత చేయునదిలేక నలగామరాజు  బ్రహ్మనాయని శరణు సొచ్చెను. బ్రహ్మనాయుడు దయార్ద్రహృదయు డై వీరనాయము లెల్లరు మరణము గాంచినందువలనకల్గిన వైరాగ్యముచేత  క్షమించి నాయకురాలికి బంధవిముక్తి గావించి నలగామరాజును బునరభిషిక్తుని గావించి కెర్తి గాంచెను.
                 బ్రహ్మనాయుడు సంఘసంస్కర్త.
      వెలమకులంబున జన్మముగాంచిన రేచర్లబ్రహ్మనాయుడు శ్రీరామానుజులచే బోధింపబడిన శ్రీవైష్ణవమతమును స్వీకరించి తన్మతాభినివేసపరవశుడై యామతమును పల్నాటిలో వ్యాపింపజేసి ప్రసిద్ధుడయ్యెను. ఇతదు కులభేదమును బాటింపక యగ్రవర్ణములవారిని క్షుద్రవర్ణములవారిని గూడ వైష్ణవులను గావించి తనతోడ గలుపుకొని సహపంక్తి భోజనములను గావించి నట్లుగా వీరచరిత్రమున బలుతావుల బేర్కొనంబడియెను. ఈకాలమూ నంత్యజులనియు బంచములనియు బెద్దకులమువారనియుజెప్పబడునట్టిమాటలకు సయిత మాకాలమున వైష్ణవమతమును బోధించి దాసులనుగ జేసికొని సభలలో గౌరవించుటయేగాక వారలకు తనతోడి సపంక్తిభొజనమును గూడ గలుగజేసెను. బ్రహ్మనాయుడు మాలయైన తెప్పలినాయకిని పెమ్మ