పుట:Andhrula Charitramu Part 2.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు పాలయ్యెను. అందుపైని బ్రాహ్మణులు పరిపాలనము చేయునట్టి ప్రభువగు మనుమసిద్ది రాజుకడకు పోయి తమ కష్టములను గూర్చి మొరపెట్టుకొనిరి. మనుమసిద్ది సహృదయుడై ఇనంబ్రోలు వాసులయిన వెలమలకు వర్తమానమంపి పాకనాటిలోని ప్రజల సాహాయ్యమును బడసి వారి వివాదమునుగూర్చి విమర్శజరిపెను. ఆ విమర్శలో నా భూములు బ్రాహ్మణులవైనటుల దేలినందున వీరరాజేంద్రచోడ చక్రవర్తియొక్కక పదుమూడవ సంవత్సర పరిపాలనకాలము అనగా శా.శ.1179 (క్రీ.శ.1257-58)వ సంవత్సరమున దనతండ్రి తిరుకాళదేవ మహారాజు పుణ్యముకొరకు మనుమసిద్ధి రాజు కోడూరు గ్రామమును బ్రాహ్మణులకు దానముచేసెను. ఈ విషయములు కడప మండలములోని నందలూరి యరవశాసనములలో నొకదానివలన దేటపడుచున్నవి. [1]దీనింబట్టి పదమూడవ శతాబ్దమునకు బూర్వము కడప మండలములో మహామారిజ్వరము (ప్లేగు) గాని, అటువంటిదే మరియొక అంటువ్యాధిగాని వ్యాపించియుండెననియు, అట్టి సమయములయందు స్వగృహములను విడిచిపెట్టి పొలములలో గుడిసెలు వైచికొని కాపురముండుట క్షేమకరమని ప్రజలు తెలిసికొనియున్నారనియు బైశాసనములోని విషయములు స్పష్టముగ తెలుపుచున్నవి. ఈ శాసనములో చెప్పబడియున్న కోడూరు గ్రామము కడపజిల్లాలోని పుల్లంపేట తాలూకాలో ఉన్నది. పేరంగండూరు గ్రామమిప్పుడు గానరాదు. పై శాసనమునుబట్ట మనుమసిద్ధి రాజు పేరికిమాత్రము వీరరాజేంద్రచోడ చక్రవర్తికి సామంతుడుగనున్నటులగపడుచున్నను, స్వతంత్రుడై పరిపాలనము చేయుచుండెనని తేటపడుచున్నది. ఈ మనుమసిద్ధి రాజు యొక్క వీర్యవితరణ రూపవివేకమహిమాదులు నిర్వచనోత్తరరామాయణమునగవిబ్రహ్మచే జక్కగా వర్ణింపబడినవి.

మనుమసిద్ధి శత్రురాజులను జయించుట.

ద్రావిడోర్వీపతి గర్వంబు దునిమి కర్ణాటదర్ప విఘాతంబు గావించిన

  1. Annual Report on Eepigraphy of 1907. No.580