పుట:Andhraveerulupar025903mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వతి యయ్యెను. ప్రజ లీశుభవార్తవిని యుత్సవము లొనర్చిరి. శాలివాహనశకము...... ఆనందనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి గురువారము బ్రాహ్మీముహుర్తమందు సూర్యుడు, అంగారకుండు, బుధుడు, బృహస్పతి, యుచ్చస్థానమునను, శని స్వక్షేత్రమున నున్న శుభసమయమున నొకబాలు డుద యించెను.

ఓరుగల్లునగరమున నానా డొనరింపబడిన వేడుకలకు మితము లేదు. పురమంతయు నలకరింపడెను. ఆలయము లన్నింటియందు మహోత్సవములు జగన్మోహనముగా జరుపబడెను. మంగళవాద్యము లెడతెగక మ్రోయింపబడెను. రుద్రమదేవి నామకరణోత్సవము మహావైభవముగ నెర వేర్ప జేసి ప్రధానమంత్రియగు శివదేవయ్య యనుమతిచే నాబాలునకు శ్రీమన్మహారాజ వీరప్రతాప రుద్రదేవ చక్రవర్తియని నామకరణ మొనరించెను. శుక్లపక్షచంద్రునివలె నాబాలు డభివృద్ధి నొంది బాల్యమునందె ధనుర్విద్యయు, వ్యాయామ విద్యయు, సంస్కృతాంధ్రములు, రాజనీతియు గురువులకడ నభ్యసించి ముత్తవయగు రుద్రమదేవితో రాజసభామందిరమున ఆసీనుడై పరిపాలనా విధానమును గూడ బసితనముననె నేర్చు కొనెను.

రుద్రమదేవి తనవార్ధకమున మనుమడగు ప్రతాపరుద్ర దేవునకు బట్టాభిషేకము జేయసంకల్పించెను. ఈశుభసంకల్పము వినినంతన ప్రతాపరుద్రుడు పట్టాభిషేకానంతరము విశ్రాంతి