పుట:Andhraveerulupar025903mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యయ్యెను. తన సామ్రాజ్యము నీత డోరుగల్లులో స్థాపించి చాళుక్యులను చోళులను జయించి యభివృద్ధిలోనికి దెచ్చెను. పుత్రసంతానము లేకపొవుటచే నీయనపుత్రి రుద్రమదేవి రాజ్యమునకు వచ్చి చిరకాలము మహత్తరముగ నాంధ్ర సామ్రాజ్యమును బాలించెను. పితృ దత్తమగు రాజ్యము నీయమ విస్తరింపజేసి తిరుగబడిన రాజుల బిలుకుమార్చి యాంధ్రజాతియం దంతర్హితమైన పరాక్రమము నీయమ యొక్కమాఱు బ్రజ్వలింపజేసెను. ఈయమకు బురుషసంతతి లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మయను నిరువురు కుమార్తెలు గలరు. ముమ్మడమ్మను చాళుక్యాన్వయుడగు వీరభద్రరాజు, రుయ్యమ్మను ఇందులూరి అన్నభూపతియు బెండ్లాడిరి. అల్లుండ్లిరువురు ప్రత్యేక మండలాధిపతులైనను రుద్రమదేవికి గుడి భుజముల వలె నుండి సంగరములం దాయమకు సాయపడుచు విజయలక్ష్మిని గనుసన్నలలో నుంచిరి. రుద్రమదేవి తనపుత్రికలకు బుత్రసంతానము గలిగెనేని వారికి రాజ్యము స్వాధీనము జేసి కృతార్థురాలు గావలెనని సంకల్పించెను. పెక్కువ్రతములు గావించెను. ఎన్నియో యాలయములు గట్టించెను. కానవచ్చిన దేవరలకెల్ల దాను మ్రొక్కి కుమార్తెలచే మ్రొక్కించెను. అయినవోలు మైలారుదేవరకు, కొలనుపాక సోమనాథునకు, వేములవాడ రాజేశ్వరునకు, మొగిలిచర్ల ఏకవీరాదేవికి మహోత్సవముల జేయించెను. దైవానుగ్రహమున ముమ్మడమ్మ గర్భ