పుట:Andhraveerulupar025903mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండుము. నేను జయము సాధింతు"నని ఖడ్గతిక్కనను సైన్య సహాయముతో నెదిరించెను. ఉభయులు రణకౌశలులగుటచే జిరకాలము జయాపజయ నిర్ణయముల కనువుగానటుల బోరాడిరి. కాలవశమున వీరవతంసుడగు ఖడ్గతిక్కన మరణించెను. స్వామిభక్తిగల యాతనియశ్వము ఖడ్గతిక్కన శిరమును నోట దగిలించుకొని నెల్లూరిలోని తన యజమాని యింటివద్దకు జేరి సకిలించెను. ఇంటిలోని వారందఱువచ్చి చూడఖడ్గతిక్కనశిరము గోచరించెను. ఖడ్గతిక్కన రణరంగమున మరణించినవా ర్త వినినంతనె నగరమంతయు క్షోభించెను. వీరవతంసు లందఱు కన్నీరు గార్చిరి.

మంచములోనున్న సిద్ధానామాత్యుడు కుమారుని వీరమరణవార్త వినినంతన యానందబాష్పములు విడుచుచు బరలోక మలంకరించెను. ఆయన తల్లియగు ప్రోలమాంబ కుమారుని శిరము ముద్దాడి యిప్పటికి వీరమాత ననిపించుకొంటినని ప్రాణములు విడిచెను. చానమ్మ భర్తతల నొక కాష్ఠమునందుంచి తానును నందుజొచ్చి సర్వజన ప్రశంసాపాత్రురాలై కీర్తివహించెను. ఖడ్గతిక్కన భౌతికస్వరూప మేనాడో నశించినది. చరిత్రాభిరతులు నుత్సాహశాలురునగు నాంధ్రయువక హృదయములం దామహావీరునితేజము నేటికి బ్రకాశించుచున్నది. ఈవీరునిజన్మకాలము తెలియదుగాని క్రీ.శ. 1200-1260 వఱకున్న తిక్కనసోమయాజికి సమకాలికుడును, సోదరుడును గాన నించుమించుగా నాకాలముననే యున్నటుల