పుట:Andhraveerulupar025903mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నలుసు కలుగుననియు మనుమసిద్ధి భూపాలుడు సర్వసేనానాయకుడగు ఖడ్గతిక్కన యనుమతి చొప్పున సంగరమునకు తలపడియెను.

ఈవార్త యాదవులు విని కాటమరాజున కెఱింగించిరి. కాటమరాజు తన బంధువులు వీరులు నగువారికందఱకు వర్తమానము లంపి పిలువనంపి సైనికబలము నాయత్తపఱచెను. కొండపల్లి చల్లపిన్నమ్మనాయకుడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టామరాజు, కరియాపులరాజు, వల్లభన్న, నేతిముద్దయ్యనాయడు, పురుషోత్తమరాజు లోనగు సుప్రసిద్ధ యాదవప్రముఖులు సైనికసహాయులై కాటమరాజు పక్షమున జేరిరి. కాటమరాజు తనసేనకు గ్రమశిక్ష నొసంగి చిన్నమనాయని మంత్రిగను బ్రహ్మరుద్రయ్యయను బ్రాహ్మణుని సేనానాయకునిగను నేర్పఱచి సంగరమునకు సైన్యసహితముగ బయలుదేరెను. మనుమసిద్ధిపక్షమున సర్వసేనానాయకుడగు ఖడ్గతిక్కన కొంతసేన్యమును వెంటగొని ఎఱ్ఱగడ్డపాటికి బయలుదేరెను. రెండు సైన్యములును బాలేరుయొడ్డున నున్న పంచలింగములకడ సంగరమునకు దలకొనెను. యాదవులు చెక్కు చెదరులేక మతావేశము స్వతంత్రదీక్ష నూతగాగొని ముక్కాకలదీరిన ఖడ్గతిక్కన సైన్యముతో మిగుల భయంకరముగా బోరాడిరి. ఖడ్గతిక్కన నిర్లక్ష్యభావముతో యాదవులను సరుకుసేయక స్వల్పబలమును మాత్రమె వెంటతెచ్చెను. ఐనను నిరుత్సాహపడక యాదవ