పుట:Andhraveerulupar025903mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాటమరాజుకథ వినిపించి ఖడ్గతిక్కన జీవితచరిత్రమును విస్మృతి తరంగము చాటున నదృశ్యముకాకుండ గాపాడిన వీరకథా గాయకులకు బ్రకృతకథాపఠనావసరమున గృతజ్ఞత దెలుపుట మన విధులలో నొకటియై యున్నది.

కాటమరా జను యాదవవంశజుడు నెల్లూరుమండలమందుగల కనిగిరిసీమలోని యెఱ్ఱగడ్డపాడుప్రాంత భూతములను బాలించుచుండెను. ఇతడు గొప్ప భూస్వామియు నపరిమిత పశుధనము గలవాడునై సజాతీయుల కందఱ కధిపతియై మిగుల బలుకుబడితో గులపెద్దయను గౌరవముతో గాలయాపనము చేయుచుండెను. ఆ కాలమున గొన్నిసంవత్సరము లనావృష్టి తటస్థించుటచే బ్రజలకు బశులకు గూడ చాల చిక్కులు గలిగెను.

యాదవులు విశేష పశుగణము గలవారగుటచె దమ బీళ్లన్నింటను గడ్డిలేకుంట చూచి తృణజల సమృద్ధిగల తావులకేగి పశువుల మేపుకొని దేశము సుభిక్షమైనపిమ్మట తిరిగి యిండ్లకు జేరనిశ్చయించిరి. కొందఱు యాదవులు దూర దేశములకుబోయి పైరుపచ్చలు చల్లగానుండు ప్రదేశము తాము చూచినంతలో నెల్లూరిచెంతగల పాలేరుతీరమని వచ్చి తమ రాజున కెఱిగించిరి. కాటమరాజు పశుగణమును యాదవులను వెంటగొని నెల్లూరిప్రాంతములకేగి యట తనపశువులను బశుపాలకులను నాపి, ఆప్రాంతముల బాలించు మనుమసిద్ధి