పుట:Andhraveerulupar025903mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలవు. వీరశిరోమణి యగు ఖడ్గతిక్కన యింత ప్రసిద్ధు డగుటకు నాతని తల్లియు వీరమాతయు నగు పోలమాంబ స్తన్యప్రభావమని వేఱుగా జెప్పబనిలేదు. ఖడ్గతిక్కన కేవలదండ నాయకుడుగ నుండి కులాచారములు విడనాడినవాడు కాడు. ఇతడు వేదగానలోలుడు. బ్రాహ్మణకుటుంబ పోషకుడు. దానకర్ణుడు. విరోధిఖండన చణుడు. ఈమహామహుని యాశ్రయమున "రాయవేశ్యా భుజంగరాజమూర్తి గంధవారణా"ది బిరుదము లన్వర్థములై ప్రశస్తిమంతము లయ్యెను. ఒకకవితా విషయమున జెప్పుట కాధారములు లేవుగాని పరాక్రమౌదార్య పాండిత్య రాజకీయ పరిజ్ఞానాది మహాపురుష ధర్మములలో దిక్కన సోమయాజికి ఖడ్గతిక్కన యించుకేనియు దీసిపోవ జాలడనియు బై పెచ్చు పయిజేయిగా నున్నాడనియు జెప్పనగును. కేతనకవి యీమహావీరుని గుణవర్ణనము మిగుల మనోహరముగా గావించి ప్రశంసించియున్నాడు. ఆయన వర్ణన భాగముల దిలకింతుమేని ఖడ్గతిక్కన నాంధ్రపరశురాముడని ప్రశంసింప వచ్చును.

ఖడ్గతిక్కన విజయము తెలుపు కథాగ్రంథములలో కాటమరాజుకథయొకటి. కొట్టరుపువంశతిలకుడగు ఖడ్గతిక్కన పరాక్రమ జీవితము, స్వామిభక్తి యీగ్రంథమువలన నెఱుంగవచ్చును. విద్యాప్రియులగు నాగరకులకు జిరకాలమునుండి