పుట:Andhraveerulupar025903mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న చిన్న రాజులు పాలించుటయు బ్రజలలో స్వాతంత్ర్యభావ ముదయించి తమలో దాము పోరాడు కొనసాగిరనుటకు బాలచంద్రుడు ఖడ్గ తిక్కనల చరిత్ర ముదాహరణముగ గొననగును. చీలిపోయిన యాంధ్ర తేజమును గేంద్రీకరించి స్వతంత్రమగు సామ్రాజ్యమును బ్రజా క్షేమకరముగా బాలించిన మహోదారుడు ప్రతాపరుద్ర చక్రవర్తి. ఈతని కాలముననే సమస్త కళలు, భాష ఆంధ్రజాతీయిత అభివృద్ధికి వచ్చినవి. పరాధీన దుర్దశ బ్రాప్తింపవలసి యుండుటచే నీ చక్రవర్తి బంధీకృతుడు గావలసి వచ్చినది. ఈయన యనంతరము దేశీయువీరులు చిన్న చిన్న రాజ్యములు స్థాపించి యెటుల నభివృద్ధిమార్గముల నన్వేషించిరో బ్రాహ్మణు వీరు లెటుల సామ్రాజ్య నిర్మాణమునకు దోడుపడిరో తెలిసికొనుటకు హరిహరరాయల బుక్కరాయల మాధవవిద్యారణ్యుల చరిత్ర సంగ్రహము సాధనము కాగలదు. ఆంధ్రసామ్రాజ్యము పునరుద్ధరించి తనకత్తి కెదురులేకుండ బోయినతావున నెల్ల జయము నొంది ద్రవిడాంధ్రోత్కలు దేశములను లోగొని ఆంధ్రదేశమును యపనులపాలుగాకుండ గాపాడినది శ్రీకృష్ణదేవరాయలు.

ఈ మహాత్ముని వాజ్మయసేవ, దేశసేవ, మాతృదేశాభిమానము నద్వితీయము. సమగ్రమగు నాంధ్రత్వ మంతయు నితనియెడ నిండి నిబిడీకృత మయ్యెను. ఆంధ్రుల పతనమునకు సూచనలు కృష్ణదేవరాయల తుది కాలము నుండియే యేర్పడెను. తరువాత నేకామిషవాంఛతో హిందూ మహమ్మదీయులకు రాజకుటుంబమునకు గలతలు సంభవించెను. అన్నింటిని సవరించి రాజ్యము పునరుద్ధరించిన వాడు రామరాజు. పూర్వులకంటె నీత డత్యున్నత వహించెను గాని యీతడు ఘోర మృత్యు ముఖమున నదృశ్యు డగుటతో నాంధ్రుల సంపద, పెంపు, ఉన్నతి నసించెను. ఇవియే పరాధీనతకు మొదటి దినములు. తరువాత నెంత వీరుడేని స్వతంత్రరాజ్యము స్థాపింప వీలు లేకపోవుటయు బరస్పరాసూయలు ప్రజల