పుట:Andhra bhasha charitramu part 1.pdf/855

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(10) అందిపొందిన (వాడు), కనీవినని (మాట), కానిపోని (పని), పెట్టిపొయ్యలేని (వాడు), లేనిపోని (మాటలు), - ఈ ధాతుజ విశేషణములలో రెండు పదములకును నర్థము వేఱయినను నవి యెల్లపుడును కలిసియే ప్రయోగింప బడును.

(11)అచ్చికబుచ్చిక, అరులుమరులు, అవురునవురు, అవురునవురు, అసురుసురు, ఉస్సురసురు - ఇందలి రెండుపదములు రూపమున భేదించినను నేకార్థకములు.

(12) అంక (-౦కా)పొంకములు, అగవుతగవులు, అంతలపొంతలవాడు, అరవరలు, ఆపసోపాలు (పడు), ఈఱతాఱలు, చెట్టాపట్టా (-ట్టీ)లు, మిఱుమిట్లు, రొక్కాపక్కములు, వసివాళ్లు, విచ్చవిచ్చలు, వేనవేలు, సగ్గిసముగ్గిసలు - ఇవి నిత్యద్వంద్వసమాసములు; నిత్యబహువచనాంతములు. అందలి రెండుపదములును నేకార్థకములు.

కుప్పలుతిప్పలు మొదలగు సమాసములందు రెండుపదములును బహువచనాంతములుగానే యుండును. 'కుప్ప తిప్పలు' అనుటయు గలదు.

(13) ఈక్రిందివి యవ్యయములు:-

(అ) పదింబది, పొరి (c) బొరి - వీనిలో మొదటిపదముపై నను స్వారము చేరుచున్నది.

(ఆ) పరి(-ఱి) పరి (-ఱి), పాట పాట - వీనిలో మొదటిపదమే యామ్రేడిత మగుచున్నది.

(ఇ) కళవెళ, చిటపట, మొదలగువానిలో రెండవపదము మొదటి దానికంటె భిన్నమగుచున్నది. ఇట్టి వనేకములు ధ్వన్యనుకరణశబ్దములను శీర్షికక్రింద చూపబడినవి.

(ఈ) చుబ్బనచూఱ మొదలగు సమాసములందు నేకార్థములగు భిన్నపదము లున్నవి.

(ఉ) అంజలిగుంజలి, ఉక్కిరిబిక్కిరి, కక్కిరిబిక్కిరి, కొక్కిరిబిక్కిరి, చిన్నారిపొన్నారి, చీకిలిమాకిలి, తక్కిడిబిక్కిడి, వంకరటింకర - ఇందేకార్థకములగు భిన్నపదములు చేరినవి. ఈ రెండును నష్టధాతువుల క్త్వార్థక రూపములై యుండును.

(ఊ) ఎడపాదడపా, చెడాప (-మ)డా - ఇట్టివానియందు థాతువుల తుమున్నర్థకరూపములు చేరినవి. ఇగ్గమ్రొగ్గ(నడచెను) అనుదాని