పుట:Andhra bhasha charitramu part 1.pdf/842

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకప్రక్కకు కుచ్చెళ్లన్నియు మూటకట్టి ముడిచినకట్టు); ఓని(?)కట్టు = కొండల నడిమి గొందిదారి (సం.అవనికృష్ట = ప్రా. ఓనికట్ట = తె. ఓనికట్టు); కరి(?)వెద = నేలదున్ని విత్తుటకు వాన నెదురుచూచుట (కరి = 'కారు'నకు సంబంధించిన వెద = బీజము; కారున విత్తనములు చల్లుటకు సిద్ధపడుట; తొఱు(?)ద్రొక్కు (శ. ర. త్రొక్కు + త్రొక్కు; మళ. కన్న. తుఱి, తొఱి; తుళు. తొర్ = త్రొక్కు; .అళ. కన్న. ఱ = ఱ); పావ(?)కోళ్లు (పాద = ప్రా. పాఅ, తె. పావ); పోటనబంతి = పుట్టబంతి (పుట్ట = పోట; పోటంబంతి, పోటనబంతి); బొమ్మంచు = ఎఱుపు, ఎఱుపువన్నె వస్త్రము, ఎఱ్ఱనిది, 'బొమ్మ + అంచు' అని శ. ర. లో పదచ్ఛేదము; కాని, 'పొం = బంగారు, బంగారువన్నె' అనియర్ యర్థము చెప్పికొనవలెను; హేర(రా)వళి = ఇందు 'హేర(రా)' శబ్దమున కర్థము తెలియదు; వలి యనగా వస్రము. 'పొడవన్నెకోక' యని శ. ర.

ఉత్తరపదము స్వరూపము మఱుగుపడినవి.

ఈరుపెన? (పెన = దువ్వెన, అని శ. ర> లో లేదు; గంజాము విశాఖపట్టణము జిల్లాలలో శూద్రవ్యవహారమున 'పయిన' అనియు, ఉత్తమజాతివారి వ్యవహారమున 'పన్నె' అనియు వ్యవహారము గలదు); క్రొత్తముట్టు? = శ. ర. వడుక నారంభించినప్పుడు ఏకుననుండి పురిలేక చాగదీసి కదురున కంటిం చెడునూలు; "కళ్యాల బదిలంబుగాని గుఱ్ఱంబుల గ్రొత్తముట్టున కియ్య కొలుపు వెరవు. - భార. విరా. V. - శ.ర. లోని యర్థముగల 'ముట్టు' శబ్దము వడకుటయందు వాడుకలో నున్నదేమో తెలియదు. ఇచట 'ముట్టు' అనగా 'కొఱముట్టు, పరికరము' అని యర్థము చెప్పవలెనేమో. "వాహనములు వానివాని ముట్టులనొక్క వలనుగానొనర్చి" - భార. మౌ. I; "గుఱ్ఱములు కళ్లెములకు లొంగకపోయినయెడల వానిని లొంగదీయుటకు గ్రొత్త సాధనముల నుపయోగించు నేర్పు" అని పై విరాటపర్వములోని పద్యమున కర్థము చెప్పవలెనేమో; ఆనవాలు(?) = గుఱుతు, ఆజ్ఞాపత్ర?; ఏడుడి? = ఆబ్దికము ('ఏడుడి' అని బిందుపూర్వక 'డి' వర్ణ ముండవచ్చును; 'ఉడి' 'ఉండి'కి సంక్షేపరూపము కావచ్చును; ఒకయేడుండి చేయు నాబ్దికము; చూ. ఎల్లుండి; కత్తెరగాయము(?) - సం. ఘాతము = తె. గాయము, కత్తెర ఆకారముగా గోడలో త్రవ్వబడిన గవాక్షము; నటవాలు = అశ్వగతి విశేషము, రేచితము = సం. నాట్యపాత? - నిగ్గడి = మిక్కిలి కఠినము (నిఱు + కడి; 'కడి' కఠినశబ్దభవము. పావు కోళ్లు