పుట:Andhra bhasha charitramu part 1.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇవి శాకపార్థివాదులు. ఇది యాకృతిగణము, అనగా నిట్టి వింకను నుండవచ్చుననుట: కృతాపకృత, భుక్తవిభుక్త, పీతవిపీత, గతప్రత్యాగత, యాతానుయాత, క్రయాక్రయికా, వుటావుటికా, ఫలాఫలికా, మానోన్మానికా మొదలయినవియు శాకపార్థివపదమువంటివే.

(10) సత్, మహత్, పరమ, ఉత్కృష్ట, అను పదములు పూజ్యార్హులను దెలుపు పదములతో సమసించును. ఉదా. సద్వైద్యుడు, మహాపురుషుడు, పరమపురుషుడు, ఉత్కృష్టపురుషుడు మొదలయినవి. పూజ్యార్థము లేనప్పుడు సమాసముకాదు. గోవు బురదనుండి యుత్కృష్టమయినది (పైకి తీయబడినది). ఇచట పూజ్యార్థములేదు.

(11) పూజార్హతను దెలుపుపదము బృందారక, నాగ, కుంజర పదములతో సమసించును: ఉదా. గోబృందారకము మొదలయినవి.

(12) 'కతర, కతమ' అను పదములు జాతినిగూర్చి ప్రశ్నించునప్పుడుసమాసవిభక్తికము లగుపదములతో సమసించును. ఉదా. కతరకఠుడు = వీరిలో నెవడు కఠజాతికి జెందినవాడు ? కతరకాలాపుడు = వీరిలో నెవడు కాలాపజాతికి చెందినవాడు. జాతియనగా గోత్రము, చరణము అని యర్థము. ఇట్టి సమాసములు తెనుగున జేరలేదు.

(13) 'కిమ్‌' అనుపదము నిందార్థమున సమాసమున నితరపదముతో జేరును: ప్రజలను రక్షింపనివాడు 'కింరాజు'; ద్వేషించు సఖుడు 'కింసఖుడు;' చూలుదాల్పనియావు 'కింగోవు' మొదలయినవి.

(14) జాతివాచకపదము పోటా (మీసముగల యాడుది), యువతి (యౌవనవతి), స్తోక (కొంచెము), కతిపయ (కొన్ని), గృష్టి (మొదటి యీత యావు), ధేను, (పాడియావు), వశా (గొడ్రాలు), వేహద్ (గర్భ చ్యుతి యైన యావు), బష్కయణీ (ఎదిగిన దూడ గలయావు), ప్రవక్తృ (వ్యాఖ్యానము చేయువాడు), శ్రోత్రియ (వేదము నభ్యసించిన బ్రాహ్మణుడు). అధ్యాపక (అధ్యయనము చేయించు గురువు), ధూర్త (మోసగాడు, నేర్పరి) అను పదములతో సమసించును. ఉదాహరణములు (15) లో చూపబడును.

(15) 'ఊ'కారాంత స్త్రీలింగపదములుతప్ప తక్కిన స్త్రీప్రత్యయాంత పదములు కర్మధారయసమాసమందు పూర్వపదములుగా జేరియు, జాతీయ, దేశీయ, పదములకు బూర్వమందుచేరియు పుంలింగ రూపములను దాల్చును. ఉదా. మహానవమి, కృష్ణచతుర్దశి, మహాప్రియ, పాచకస్త్రీ, దత్తభార్య, పంచమభార్య, సుకేశభార్య, బ్రాహ్మణభార్య, పాచకజాతీయ, పాచకదేశీయ, ఇభపోట, ఇభయువతి, అగ్నిస్తోకము, ఉదశ్విత్. కతిపయము = మజ్జిగబొట్టు,