పుట:Adhunikarajyanga025633mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగా ఎన్నుకొనబడినపిమ్మట, ఎన్నికలయం దట్టి సవరణపై ప్రజలకు చర్చుంచుట కవకాశమిచ్చినపిమ్మటనే, పార్లమెంటుయందు ప్రవేశపెట్టుట కలదు. మరొకవిధముగా 'శాసనసభ' యే రాజ్యాంగవిధానమును సవరణచేయుట కలదు. ఫ్రాన్సు, దక్షిణాఫ్రికాలయందువలె, రెండుశాసనసభలవారు కలసి సమావేశమై అధికసంఖ్యాకుల సమ్మతిపై నట్టి సవరణ బిల్లు నంగూకరింపవచ్చును.

శ్రీ రూస్సోమహాశయుని శిష్యులగు శ్రీ దాంతే, మిరాబో రాబెస్సెరీ, లఫాయతు ఆదిగాగల విప్లవనాయకులు ప్రధమరాజ్యాంగ

3. ఫ్రెంచివారి
రాజ్యాంగ
విధానము.

విధానపు చట్టమును నిర్మించిరికాని, విప్లవముతో నయ్యదియు అంతమొందెను. మూడవ నెపోలియను చక్రవర్తి, జర్మను వారిపై యుద్ధమునకు వెడలి అపజయమంది పదభ్రష్టుడై పారిపోయినప్పుడు, ఫ్రాన్సు దేశము జర్మనుదేశమునకు పూర్తిగా లొంగిపోయియుండెను. తిరిగి దేశమునకు ప్రాణముపోసి జర్మనువారి యాధిపత్యమును బోగొట్టుకొని దేశమునందు ఏదో యొక విధముగా శాంతినెలకొల్పుటకై శ్రీధియార్చ మహాశయుడు 1871 సంవత్సరమున "నేషనల్ అస్సెంబ్లీ"ని సమావేశపరచెను. ఆ అస్సెంబ్లీద్వారా నాల్గు వత్సరముల పర్యంతము ప్రభుత్వమును నడపి, తుదకు 1875 నందు మూడు రాజ్యాంగవిధానపు చట్టములను అస్సెంబ్లీచే