పుట:Adhunikarajyanga025633mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకటి, లేక, రెండు, లేక మూడుమార్గములగా నైన, ఈతరగతియందు జేరు రాజ్యాంగ విధానములు మార్పు జెందవచ్చును:- (1) కొన్ని ప్రత్యేకనియమముల ననుసరించి, ఇప్పటి పార్లమెంటు ద్వారానే సవరణచేయబడవచ్చును. (ఫ్రాన్సు) - (2) ప్రజలయొక్క అభిప్రాయమును "రిఫరెండము" ద్వారా కనుగొనుటచేత (జర్మనీ, స్విట్జర్లాండు, ఆస్ట్రేలియా, ఐర్లాండు) - (3) సమ్మేళనమందు జేరిన సభ్యరాష్ట్రములం దధిక సంఖ్యాకము లంగీకరించినచో (అమెరికా, జర్మనీ) - (4) ప్రత్యేకముగా సవరణ చర్చించుటకై యేర్పడు "కన్వెన్షను" ద్వారా (అమెరికా), ప్రధమ పద్ధతికి జెందిన దేశములలో కొన్నిటి యందు (బెల్జియము, రుమేనియా, జర్మనీ) సవరణబిల్లును ప్రతిపాదించుటకు నిర్ణీతమగు సభ్యులు ముందుగా ఆమోదించవలెననియు, అంగీకరింపబడుటకు నిర్ణీతమగు (సాధారణముగా నాల్గింట మూడులేక, మూడింట రెండువంతులు) మెజారిటీ యుండవలెననియు యేర్పాటుకలదు. ఇందుకుతోడు, అట్టి బిల్లు అంగీకరింపబడిన పిమ్మట, శాసనసభను అంత మొందించి తిరిగి ఎన్నికలనుబెట్టి, అట్టి సవరణచట్టముపై ప్రజల యభిప్రాయము కన్గొనుటకూడ కొన్నిదేశములందు (నార్వే, స్వీడను) కలదు. ఇంగ్లాండునందైనను, ప్రాముఖ్యమగు రాజ్యాంగ విధాన సవరణ బిల్లును సాధారణముగా పార్లమెంటు నూతన