పుట:Adhunikarajyanga025633mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తదితరరాజ్యాంగవిధానములవలెగాక, ప్రజాస్వామిక రాజ్యాంగము కాలమహిమవలనకాని, తన్నుపయోగించుకొను ప్రజలకష్టనిష్ఠూరములవలన కాని, తనయందు కల్గుచుండు అవగుణముల, ననారోగ్యమును రూపుమాపుకొను శక్తిసామర్థ్యముల బొందియున్నది. మనుజుడెట్లు, తనకు సంభవించు సాధారణమైనజబ్బుల మందుమాకులు సేవించుటద్వారా పోగొట్టుకొని తిరిగి ఆరోగ్యము బొందగలడో, అటులనే, ప్రజాస్వామిక రాజ్యాంగముకూడ, స్వరక్షణశక్తిని బొందియున్నది. తనకుతానై తెచ్చుకొన్నగాని, దురదృష్టవశాత్తుకల్గినగాని జబ్బులు మితిమించి తనపైకొచ్చినచో, మనుజుడెట్టు స్వరక్షణశక్తిన్రుక్కి అసహాయుడగునో, అటులనే ప్రజాస్వామికముకూడ, అసాధారణపరిస్థితులందు తన అంగములగు, తనయధికారులగు ప్రజల కర్మ పరిపాకమువలన తెన్నుదిగమ్రింగువ్యాధులకు లోనగుచో రూపు మార్పు జెందక తప్పదు. సాధారణపరిస్థితులందు మాత్రము స్వపోషణ, స్వరక్షణాశక్తి దానికికలవని, అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా యుదంతములు తెల్పుచున్నవి. దేశాంతర్గత యుద్ధమునందు (1864-1868) అమెరికా ప్రజాస్వామిక రాజ్యాంగము చెక్కు చెదరకుండా జయమందినది. వివిధసభ్య రాష్ట్రములందు, ప్రజాప్రతినిధి సంస్థలు అపనిందపాలైనను, తగురీతి ఋజుమార్గమున సంస్కరింపబడుచున్నవి. అటులనే ఇంగ్లండునందును, అల్పసంఖ్యాకులకే చెందియున్న పార్ల