పుట:Adhunikarajyanga025633mbp.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మగు స్థానమలంకరించుటకుమారు అనేక రాచకీయపుబృందములు బయలుదేఱినవి. ఇందువలన ఇంగ్లాండు, అమెరికా దేశములందు పెత్తనమందుండు ప్రభుత్వము ఏదేనొక్కపక్షమునకే చెందియుండ ఆదేశములందలి ప్రతిమంత్రివర్గము రెండు, మూడు, నాల్గురాచకీయ బృందముల సమ్మేళనము ద్వారా నిర్మింపబడుచున్నది. కనుక, ఇంగ్లాండుదేశపు మంత్రివర్గము రెండుమొదలుకొని ఐదువత్సరములవరకు పెత్తనమందుండుచుండ ఫ్రాన్సు, జర్మనీ దేశములందు ఆరుమాసముల నుండి పదునెనిమిది మాసములకంటె హెచ్చుకాలము మను చుండుట లేదు.

ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశములందును, ఇంగ్లాండునందువలెనే, రెండే ముఖ్యమగు రాచకీయపక్షములు ప్రాముఖ్యతవహించి యుండుటచే, మంత్రివర్గములు కొంతవరకు నిలకడజెందియున్నవి.

కనుక, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశములందలి, ప్రజాప్రతినిధిసభా సభ్యులకు, హెచ్చుస్వాతంత్ర్యము కల్గుటలేదు. అచ్చటి రాచకీయపార్టీలే, ప్రాముఖ్యతబొంది, రాచకీయాధికారము కల్గి, వ్యక్తులగు సభ్యుల స్వాతంత్ర్యము నరికట్టు చున్నవి.ఫ్రాన్సునందట్లుగాక, బృందములనేకముండుటయు, మంత్రివర్గములు బృందముల సమ్మేళనములపై యాధారపడి యుండుటచే, సభ్యులు వ్యక్తిగత