పుట:Adhunikarajyanga025633mbp.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయకల్గుచున్నవి. పార్టీలే లేనిచో సభ్యులెల్లరు "ఎవరికి వారే యమునాతీరే" యనునట్లు అనేక దారులబట్టి వివిధ బృందముల నేర్పరచుకొని తమలోతాము కొట్టాడుకొనుచు భీభత్సముచేయుచుందురు. ఇంగ్లాండునందు కొన్నిశతాబ్దముల పర్యంతము రెండేపక్షములుండెడివి. కాని క్రిందటి యిరువదియైదు వత్సరములనుండి మూడుపార్టీలు (కన్సర్వేటివు, లిబరలు లేబరు) ప్రాముఖ్యతబొందుచున్నది. అందు కన్సర్వేటివు, లేబరుపార్టీలు అత్యంతముఖ్యతబొందినవి. ఆదేశపు రాచకీయనాయకులలో శ్రీఏడ్మండుబక్కుగారుతప్ప తదితరులెల్లరు పార్టీలప్రాపకముజూచి భయసంభ్రమముల బొందుచుండిరి. కాని, కామన్సుసభయందు కార్యనిర్వహణమొనర్చుటకై పార్టీపద్ధతిని ఎల్లరు నుపయోగించుకొను చుండిరి. అమెరికాయందును ప్రధమప్రెసిడెంటుగారగు జార్జి వాషింగ్టను గారు పార్టీ పద్ధతికూడదని అమెరికనుప్రజలకు భద్రతగొల్పినను ఆయన వానప్రస్తమునకు వెళ్ళిన ఆరువత్సరములలోనే రాచకీయపార్టీలు ప్రెసిడెంటు ఎన్నికలందు ప్రజ్వలించమొదలిడెను. అప్పటినుండి యిప్పటివరకు అమెరికాదేశపు శాసనసభలందు రెండుపార్టీలు (రిపబ్లికను డెమాక్రాటెకు) ప్రధానస్థానమాక్రమించి యున్నవి.

ఫ్రాన్సు, జర్మనీ, బాల్కనురాష్ట్రములు, ఐర్లండు దేశములందు రాచకీయపార్టీలు రెండో మూడో ప్రధాన