పుట:Adhunikarajyanga025633mbp.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జర్మనీయందలి సభ్యరాష్ట్రములు పరస్పరముగా సమానసభ్యత్వము సెనెటుసభయందు పొందక ప్రషియా, బవేరియా రాష్త్రములు చాలతక్కువగాను, తదితరరాష్ట్రములు వాని జనసంఖ్యనుపట్టి హెచ్చుగాను సభ్యత నివ్వబడియున్నవి. ఈసభ్యులు ఎన్నుకొనబడుటకుమారు సభ్యరాష్ట్రీయప్రభుత్వముల ప్రతినిధులై యున్నారు. ఈసభవారును సమ్మేళన రాజ్యాంగపు ప్రత్యేకవిధులు కొలదిగా నిర్వర్తింపుచున్నారు. ఇంతయైనను అమెరికాయందుతప్ప తదితర సమ్మేళన రాజ్యాంగములందు, సెనెటుసభ లేకుండగనే రాజ్యాంగవ్యవహారములను ప్రజాప్రతినిధిసభవారు సంతృప్తికరముగా చక్కబెట్టి అవసరమగు శాసననిర్మాణము జేయగలరని చెప్పుటకు తగు యాధారము కలదు.

రెండవశాసనసభ ప్రజాప్రతినిధిసభవారికి సహాయముచేయుటకే అగత్యమగుచో అయ్యది "నస్తునిర్మాతకుల" దైయున్న మేలు. అట్టిసభ నేర్పరచుటవలన ఇప్పటిపెద్దల సభలవలన కల్గునష్టములు కలుగవు. పైగా అనేకలాభములు చేకూరవచ్చును.

ఈవిధముగ రాజ్యాంగసూత్రముల ననుసరించియు, రాజ్యాంగానుచరణపు ఫలితముల బట్టియు జూచిన, నిరర్థకముగా

ఇంగ్లాండు.

నుండు సెనెటుసభ, వివిధరాజ్యాంగములందు ఏర్పరచబడినది. ఈసభవారు ప్రజా