పుట:Adhunikarajyanga025633mbp.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధ్యగల ధనధాన్య జనసంఖ్య భూవిస్తీర్ణతభేదముల గమనించక అన్నిటికి సమానమగు సభ్యతనిచ్చుట శ్రేయమనియు రాకీయజ్ఞులనేకులు వాదించుచున్నారు, కాని అమెరికా యందలి సెనెటులో ప్రతిరాష్ట్రమునకు యిద్దరుసభ్యులున్నను వారు, ఆయారాష్ట్రములందలి వోటరులందరిచే యెన్నుకొనబడుచున్నారు గనుక, సెనెటుసభ్యులు ప్రజాప్రతినిధి సభాసభ్యులవలెనే ప్రజాభిప్రాయమున భేద మేమంతంగా జూపెట్టకయే ప్రకటింపకల్గుచున్నారు. సెనెటుసభ్యు లేమాత్రము ప్రత్యేకించి, రాష్ట్రీయ స్వత్వములగురించి శ్రద్ధజేయుచుండుట లేదు. ఇటులనే ఆస్ట్రేలియాయందును, సెనెటుసభ్యులు ప్రజాప్రతినిధిసభా సభ్యులువలెనే, ప్రజలందరిచేతనే యెన్నుకొనబడుచున్నారు. రాగాపోగా, సెనెటుసభ్యులకు, ప్రజాప్రతినిధిసభాసభ్యులకు గలభేద మెల్ల మొదటివారు రాష్ట్రమొక్కొక్కటి ఒక్కనియోజకవర్గముగాగా అందలివోటర్లచే యెన్నుకొనబడుచుండ రెండవవారు జిల్లాలవారిగా నున్న నియోజకవర్గములనుండి వచ్చుచున్నారు. ఇటుల శాసన నిర్మాణమందు ప్రజాభిప్రాయ ప్రకటనమందు సెనెటుసభ్యులు ఈరెండు సమ్మేళన రాజ్యాంగములందు, ప్రజాప్రతినిధి సభాసభ్యులతో భేదించకున్నను సమ్మేళనమందుజేరిన సభ్యరాష్ట్రములకు జెందదగుహక్కుల సురక్షితపరచుటకై కొన్ని హక్కులబొంది, కొన్ని బాధ్యతల నిర్వర్తించవలసియున్నది.