పుట:Abraham Lincoln (Telugu).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదాయెను. వ్యాపారమునకుగాను చేర్చిపెట్టిన సారాయి మాత్రము దగినంత యుండెను. * లింకను తనభార్య సలహా యడిగి మఱి వేరు మార్గము గానక సారాయి చేయుట నెఱుగని 'ఇందియానా' జనుల కద్దాని నమ్ముకొనిన ద్రవ్యము గడింప వచ్చునని తలచి కోల్బి చెప్పిన మార్గము నవలంబింప నియ్యకొనియెను.+

బేరము ముగిసినతోడనే థామసు దన నవీన నివాస స్థలమునకు దరల నాయత్తము కావలసి వచ్చెను. కొంత భాగము ధనముగను చిశేషభాగము సారాయిగను దన గృహాదికముల విలువగ జేకొని యా సరకు నొకతెప్పపై నిడుకొని యుపక్రమ ప్రయత్నముల జేయ దా నొకడ వెడలి చనెను. త్రోవన దురదృష్ట మొకం డతని గలంచె. తన సొత్తున కపాయ మేమిలేక దరిచేరు సమయము సమీపించెగా యను నంతనమున నతం డుండం, దటాలున నాతెప్ప పల్లటిలి సారాయి ______________________________________________________________


  • ఆకాలమున నాదేశమున సారాయి యమ్ముటగాని కొద్దిగ స్వీకరించుటగాని తప్పుగ గణింపబడుట లేదు. తాగుబోతుతనముమాత్రము దూష్యమై యుండె.

+నాణ్యము లింత ప్రబలినకాలమున నొక్కడు దన గృహమును సారాయి కమ్ముకొనె ననిన నతిచిత్రముగ నుండునని యొక యాంగిలేయ పుస్తుక కారుడు నుడువుచున్నాడు. మనదేశమున నిది యొక వింత యని తోచనేర దని చెప్ప నొప్పును. దరిద్రులై ద్రవ్యార్జన విశేషముగ లేక ధాన్యమున కనేక వస్తువుల గొనువారు మనవా రనేకులు.