పుట:Abraham Lincoln (Telugu).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్కెప్పుడు నిరర్ధకం బగునో యని జడియుచుండును. ఈ భయము లింకనులకు గూడ కలిగెను. ఈ రెండు కారణములకును థామసు పర్యట నేచ్ఛ ప్రోద్బలం బొసంగుచుండును. ఇట్టి సందర్భముల 'నిందియానా' ముక్తసీమ గాగలదా యను విమర్శ జరుగుచుండుట విని యా విషయమున థామసు నాంసీ లిరువురును మగ్ను లైరి.

1816 వ సంవత్సరము ఆకురాల కాలమున 'ఇందియానా' ముక్త సీమ యై యునైటెడ్ స్టేట్సు సంఘ రాష్ట్రమున జేరె ననువార్త బయలువెడలెను. సీమాంతరముల నుండి యచటికి జనులు గుంపులు గుంపులుగ దరలుచుండి రనుటయు విశదమాయెను. లింకనులకు గ్రొత్తసీమజొర దత్తరం బొడమె. తమస్థితి నమ్ముకొన గలిగినతోడనే ప్రయాణం బగుట కాయత్త బడిరి. అమ్ముట కియ్యకొనిన గొనువా రొకరు వలయునే యను చింత వారిని బీడింప దొడగె. దేశ కాల గతులను బట్టి యచట గొనువారే గరువైరి. వేచివేచి తుట్టతుదకు 1816 వ సంవత్సరము అక్టోబరునెల మధ్యదినముల దమ కుటీర ద్వారమున నొక నూతన విగ్రహమును కోల్బిని గాంచిరి. అతడ వీరితో బేర మాడ నేతెంచినవాడు. కొద్ది భూస్థితి సంపాదింప నిష్టము గలవా డగుట గోల్బి లింకనుల చేనుల గొన నుద్యమించెను. కాని వాని వెల నొసంగుట కతనికద ద్రవ్యము