పుట:Abraham Lincoln (Telugu).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"దేశాధ్యక్షా! తా మెంతకార్యమునకు గడగితిరో యెఱుంగుదురే?' యనెను.

"మీవైద్యశాలలయం దెందఱున్నా రని" లింక నడిగె. "ఐదాఱువేల భటు లున్నారు. మీ రందఱకు దర్శన మిచ్చునప్పటికి మిక్కిలి యలసెదర"ని యా వైద్యుడు ప్రత్యుత్తర మిచ్చెను.

అదివిని లింకను దరహసిత వదనుండై "ఆపని కేను బూర్ణముగ దగియున్నానని నమ్ముచున్నాను. ఎట్లైనను బ్రయత్నించి నా యోపినంత చేసెద. నా 'కుఱ్ఱల' నే నిక జూడను గాబోలు. కావున వారు దేశక్షేమమునకై పడినపాట్లేనెంత మెచ్చితినొ వారి కిప్పుడె వెల్లడిపఱచెద" నని వైద్యశాలకు బ్రయాణమై పోయెను.

ముఖ్యవైద్యుడు త్రోవసూప లింకను ప్రతిమంచముకడ నిలచి ప్రతిభటుని విషయము లారసి కొందఱస్థికి హర్ష మందుచు, గొందఱగతికి వగచుచు, గొందఱ జీరుచు, గొందఱ గరుణించుచు నందఱ సమ్మానించి హస్తం బొసంగు చుండెను.

ఇట్లతడు గౌరవించుచు నొక తిరుగుబాటు సేనా భటుడు పట్టువడినవాడు పరుండిన శయ్య దరియుచుండెను. అతడు చేసాచుటకుమున్ను వాడు హస్తము ముందిడి