పుట:Abraham Lincoln (Telugu).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాగ్దానమునకై యాస్నేహితుడు బడలియుండినందున నతని మూటలు మోయుటవలనను గడుదూరము నడుచుటవలనను అలసియుండినను, అతనిధర్మము దానెరవేర్ప నియ్యకొనె ననియు, బాపపునిదుర తన్ను మోసపుచ్చుట నెఱుగ డాయె ననియు, దనయధికారి స్వధర్మ మాచరింపవలసినందున దనకు సాయమియ్యజాల ననియె గావునను, దనమిత్రుడు దనకు బదులు ప్రాణము లర్పింప సిద్ధపడియుండుటను, వా రిరువురును నిందనీయులుగా రనియు, దైవము తన్ను గరుణించి, పైకి గొనిపోవుచున్నాడనియు వ్రాసి యొకలేఖ బంపెను. అతనిచెలియలు దేశాధ్యక్షుని దయాళుత్వ మెఱిగినది గావున నాజాబు దీసికొని లింకనుగారి యొద్దకు బోయి తనసోదరుని రక్షింప వేడి యాజాబు చేతికిచ్చెను. ఆయన దానిని జదివి, గుండెకరిగి యశ్రువులు చింద నాపడుచున కభయమిచ్చిపంపి, విడుదలయుత్తరువు వ్రాసి తానె దానిని దీసికొనిపోయి తగునధికారుల కిచ్చెను.

సందర్భవశమున నిదివఱ కొకపర్యాయము లింక నొక గొప్ప వైద్యశాలను దర్శించి రా వెడలుట దెలుపబడెను. దాని నిచట విపులముగ వర్ణింతుముగాత. ఒకతఱి సిట్టీపాయింటు నందలి వైద్యసాలలనెల్ల దా జూచి యుద్ధభటుల కందఱకు జేయి యిచ్చి గారవించి రా గోరి లింక నచటి ముఖ్యవైద్యునకు వార్త బంపెను. అతడు లింకనుగడ కేతెంచి,