పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాప్రభువున కెంతసైన్య మున్నదనియు అశ్వబలమెంత యుండుననియు నడిగెను. మాదేశపు నగరములందలి వింతలు విసేషములను, అందు ముఖ్యముగ సమరఖండము, హీరాబు, షిరాజు, మొదలగు నగరముల గూర్చిప్రశ్నించెను. నేను మున్నెన్నడు నెఱుగని యపార కరుణావిశేషములతో నాదరించి మన్నించెను. పిమ్మట నన్నుగాంచి "మీరాజు, మాకు నీయట్టి రాయబారినిబంపి మైత్రి నెఱపుచున్నందులకు మేమెంతయు సంతసించినారము. ఇపుడు మేము కొన్ని యేనుగులను, ఇరువురు తుకీబుకొజ్జాలను, అమూల్యములును అద్భుతములు నగు వింతవస్తువులును కానుకగానిచ్చి మీకాఖానిసయదు సుల్తాను వారికి, యోగ్యుడును, నీతికళారహస్యజ్ఞుడునగు నొక రాయబారినిచ్చి, పంపుచున్నాము" అనినాకు సమ్మోదము కలుగ బల్కెను.

"కొలువుకూటము నందు పరివేష్టితులయి యున్న రాజకుమారులలో నొకడు నన్నుజూచి, ద్విభాషిద్వారా రాయల సింహాసనము మీదనున్న జరీనగిషీ, అంచులు లతలు, పుష్పములు అల్లిన నాల్గుమొఖమలు పట్టుసోపాలనుజూపి ఎటులున్నవని ప్రశ్నించెను. ఆతని యభిప్రాయము అట్టివి మా దేశములో చేయజాలరనుట నేనెఱింగి "అవి చాలబాగున్నవి. అట్టివి మాదేశములో తయారుచేయు అలవాటు లేదు. ఒక వేళచేయ దలచిన యింత అందముగను చేయగలరని నానమ్మిక" అని ప్రత్యుత్తర మిచ్చితిని. రాయలును నాప్రత్యుత్తరమునకు సంతసించి ఎప్పటి