పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిట్టిసింహాసన ముండుటనే నెఱుగను. ఇట్టి పనితనమునుగూడ ఎచ్చటను జూచియుండలేదు. సింహాసనము మీద మూడు వరుసల ముత్తెపుసరులంచులుగాకుట్టపడిన పసుపుపచ్చని చీనాపట్టుతో చేయవడిన తల్పముగలదు. ఆముత్యముల సౌరును కాంతియు నద్భుతముగనుండెను. అట్టివాటిని నేనెచ్చను జూచియుండలేదు. ఆమహర్నవమి పండుగలలో రాయ లీసింహాసనముపై యాపట్టుమెత్తపై నాసీనుడైయుండెను. మహర్నవమిపండుగ గడచిన మరునాడు రాయలవారు నన్ను నగరునకు రావలసినదని యాజ్ఞాపించిరి. అప్పుడు సాయంసమయము. నమాజు చేసికొనువేళ. నేను నగరు సమీపించునప్పటికి అచ్చోట పదిచతురపు గజములమేర నొకకూటము సోపాన మంటపమును బోలినది నిర్మింపబడి కానవచ్చెను. ఆమంటపమునకు పైకప్పు, గోడలును, కత్తివెనుక భాగమున్నంత దళసరి బంగారురేకుతో కప్పబడి యందందు మేలయిన నవరత్నములతో మనోహరముగ స్థాపితమయి యుండెను, ఆమంటపములో ఫైనుండి మొదటి అంతస్తుమీద రాయల సింహాసనము అమర్పబడి యుండెను. ఆసింహాసన మంతయు స్వర్ణనిర్మితమే! అదిచాలాయెత్తుగాకూడ నుండెను. రాయలందు రాజసమొప్పనిండుగా కొలువుదీరియుండెను. నేనాప్రభుని సమీపించి బహూకరింపబడి యాసీనుడయిన పిదప మృదుమధుర గంభీరభాషణముల, మాయేలికయగు కాఖానిసయద్ సుల్తాను వారిని గూర్చియు నాతని సామంతులను గూర్చియు ప్రసంగించెను.