పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయి యుండిరి. యజమానియో, లేక యాతని పరివారములో పెద్దవారో, యొకరు అతిధులు కూర్చుండియున్న మంటపము కడకు వచ్చి, లోపల సిద్ధమయిన భోజనాదికము నారగించుటకు ఒకని తరువాత నింకొకరిని లోనికి దీసికొని పోవుచుండిరి. ఆమహోత్సవ సందర్భమునకు పట్టణము నందుగల యన్ని వాద్యముల వారిని రప్పించి, రాయల సోదరుడు భేరీ, మృదంగ, డక్కా, కాహళాదవాద్యధ్వనుల చేతను, సంగీతవాద్య విశేషముల చేతను, హర్మ్యమంతయు, గింగురుమని మారుమ్రోగునట్లు కోలాహల శబ్దమును చేయించుచుండెను. ఆ సందడిసమయమున, నొకరి మాట యొకరికి కష్టముమీద సయితము వినబడుటలేదు. ఒక్కొక్క అతిథిని లోనికితీసుకొని పోవుచు, ప్రత్యేకమందిరములందు కూర్చుండ బెట్టుచుండిరి. అట్లు ఒక్కొక్కడే లోనికి బ్రవేశించు నపుడు ద్వారము చెంతను తలుపు చాటున దాగుకొని యుండిన హంతకు లిరువురు, హఠాత్తుగా వాని మీదబడి, తమత్తులత్తికతో బొడిచి ముక్కలు ముక్కలుగ జీల్చివైచుచుండిరి. ఆ నిర్భాగ్యుని శవ మచ్చటినుండి యతిత్వరితముగ గొంపోవబడిన వెంటనే, మరియొక యదృష్టహీనుడు లోనికి ప్రవేశపెట్టబడు చుండెను. ఆనాడు అతిథులయివచ్చిన, అదృష్ఠీనుడెవ్వడును తిరిగి తమ యింటి ముఖమును జూడబోయి యుండలేదు.

"ఆనాడు జరుగుచుండిన మేళ, తాళ, వాయిద్యముల ఘోషవలన, నూతన గృహప్రవేశ సందర్భమున నిరపరాధులగు