పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెచ్చటనయిన సుందరియగు బాలికయుండుట తటస్థించెనేని వెంటనే రాయలామె జననీజనకుల యనుజ్ఞ బడసియో రొక్కమిచ్చియో, ఆబాలికను, మహావైభవముతో తీసుకొని వచ్చి తనవిలాసార్థము అంత:పురమునందు జేర్చుకొను చుండును. రాణివాసమున జేరిన తరువాత నామె యింక పరునికంట బడదు.

రాయలను జంపుటకు జరిగిన ప్రయత్నము

"ఈ చరిత్రకారు డింకను కళ్ళికోటనగరమున, కారణ వశమున వేచియుండిన కాలమున విజయ నగరమున దారుణ మయిన వింత వృత్తాంత మొకటి జరిగియుండెను. అందలి విశేషము లిట్టివి. రాయలసోదరుడు,[1] తన నివాసము కొఱకు నూతనముగా భవనమును నిర్మించుకొనెను. నూతన గృహప్రవేశ మహోత్సవమునాడు రాజధాని యందుగల సకల సామంత మండలేశ్వరులను, సేనాపతులను, నియోగులను, విందారగింప నాహ్వానించెను. ఇచ్చటి దేశీయుల యాచార సంప్రదాయములను బట్టి ఒకరు చూచుచుండగ నింకొకరు భుజింపరు. విందుకై యరుదెంచిన అతిథులందఱు, ఆ నూత్నమందిరమున గల యొక విశాల మంటపమునందు సుఖాసీను

  1. రాయల సోదరునిపేరు రజాక్ తెలుపకున్నాడు. ఇమ్మడి దేవరాయలునకు సోదరు రెందరో ఇప్పటికి దొరకిన శాసనములు తెలుపక సందేహము కలిగించుచున్నవి.