పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్వతపంక్తులు చాలగలవు. వర్షపాత మిచ్చట విశేషముగా నుండును. వర్షములు కురిసినప్పుడు కొండలమీదనుండి, నీరు వాకలవలె వడిగా క్రిందికి బ్రవహించును. వర్షములు వెలిసిన తరువాత, నావాకలెండిపోవును. అంతట జనులు, యా యేటి గర్భములందిసుకలో వజ్రములకై వెదకుదురు. అప్పుడు వారికి రత్నములు విరివిగా లభించుచుండును. వేసవికాలమందు వజ్రములు లభించుచుండును. కాని గ్రీష్మతాపమునకు వెఱచి జనులు కొండలలోనికి బోరు. అచ్చట త్రాగుటకొక్క గ్రుక్కెడు నీరయినను లభించదు. అదియునుగాక నక్కడ భయంకరమయిన కౄరసర్పములు ఆసంఖ్యాకములుగ నుండును. సర్పములేగాదు, విషజంతువు లనేకములుగూడ నున్నవి. వీటికి కారణము భరింపరాని యుష్ణము. వజ్రములపై నాసగొని జనియా కౄరసర్పముల కాటులకు మరణించిన వారెందరోగలరు.

"ఈకొండలనడుమ పెద్దపెద్ద లోయలున్నవి. ఏటవాలుగ నుండుటచేతను, నాలుగుప్రక్కలను ఎత్తైనకొండలుండుటచేతను ఈలోయలలోనికి మార్గములులేవు. వజ్రాలకై, జనులు వెడలినపుడు సన్నగాకోసినమాంసపుముక్కలను తీసుకొనిపోయి యాకొండ లోయలందు పారవేయు చుందురు. ఇచ్చట నివసించు పాములను భక్షించుటకై, గరుడపక్షులీప్రాంతములందు విశేషముగా నున్నవి. అవి సర్పములకొఱకై యెగురుచున్నపుడు మాంసపు ముక్కలు విసరుటగాంచి, వాటికై లోయలయడుగు