పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుదేరెను. ఆసిద్ధుని కొండకు తీర్థయాత్ర సేవించుకొని మరల కలమునెక్కి, ఆంధ్రదేశములోని ప్రసిద్ధరేవుపట్టణమగు మోటుపల్లిని గూర్చివిశేషముగ వినియుండినందున నచ్చటికి ప్రయాణమయ్యెను. మార్కోపోలో ఆంధ్రదేశములోని మోటుపల్లినిగూర్చి యిట్లువ్రాయు చున్నాడు.

"మాబారు, దేశమునుండి యుత్తరముగా దాదాపువేయిమైళ్ళు చనిన నీవు ముటఫిలి రాజ్యమును బ్రవేశింతువు. పూర్వమీదేశ మొకరాజు పాలనమందుండెను. ఆతడు చనిపోయినప్పటి నుండియు, నాతనిరాణి నలువది సంవత్సరముల నుండి పరిపాలించు చున్నది. ఆమె చాలాప్రజ్ఞావంతురాలు. భర్తమీదగల ప్రేమవలన, తిరిగి వివాహమాడ లేదు, గడచిన నలుబది సంవత్సరములనుండియు, ఆమెరాజ్యమునేలినట్లు ఆమెభర్తకూడ నేలియుండలేదు. ఆమెన్యాయము ధర్మమును మూర్తిగొన్నట్లు పరిపాలించును. శాంతి సౌఖ్యములు, ఆమె పరిపాలనమున పెట్టినపేరులయ్యెను. ఇంతవఱకు నేరాజును, ఏరాణియు, నీరాజ్యమునింత ప్రజారంజకముగ పాలించియుండలేదు. అందువలన జనులామెను భక్తి, విశ్వాసగౌరవములతో ప్రేమింతురు. ఇచ్చటిజనులు విగ్రహారాధకులు. స్వతంత్రులు. పారతంత్రము నెఱుగరు. వాఱికి మాంసము, పాలు, బియ్యము, మొదలగునవి యాహారములు,

"ఈరాజ్యమునందే వజ్రములుదొరకును. వజ్రములభించుతెఱగిది; వినుము, ఈప్రాంతమున నేటవాలుగనున్న ఎత్తైన