పుట:Aananda-Mathamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ఆనందమఠము


ఇట్లని చెప్పి భవానందుఁడు లేచి యొక గదిలోపలికి బోయి యందొక పెట్టెను దేఱచి కొన్ని గుడ్డలను తీసికొని రూపొంతరమును ధరించెను. కాషాయవస్త్రమునకు బదులుగ సొగసైన జరిదోవతి; లోపల కవచము పైన నిలువంగి; తలకు లపేటా: కాళ్లకు చడావు; వీనిని ధరించి ప్రకాశమానుఁ డయ్యెను, ముఖమున గోపీచందనము మాత్రము లేదు. భ్రమరస మానమైన కృష్ణ వర్ణశ్మశ్రుశోభితసుందరముఖమండలము అపూర్వమైన కాంతినిఁ బొందెను. అతఁడు మొగల్ జాతి యువకునివలెఁ గానంబడుచుండెను.

భవానందుఁ డివ్విధమున మొగల్ వేషధారియై శస్త్రమును ధరించి మఠము నుండి బయలు వెడలెను, అటనుండి యొకక్రోశమాత్రము దూరము పోఁగా నచట చిన్న కొండలు రెండు కనుపించెను. అది మొదలుకొని యడవియే. అకొండల నడుమ నొక నిభృతమైన స్థలము అచ్చట ననేక గుఱ్ఱములు కట్టఁబడి యుండెను. ఇదియే మఠవాసుల యశ్వశాల. భవా నందుఁ డాయశ్వములయం దొక దానిని విప్పి లగాము వేసి యారోహణము చేసి నగరాభిముఖముగా దౌడాయించుకొని పోయెను,

ఇట్లు పోవుచుండఁగా నాకస్మికముగా గతిరోధమయ్యెను, ఆదారిపక్కను నున్న తరంగిణికూలంబున గగనమార్గము నుండి పడిన నక్షత్రమువలె, కాదంబినీచ్యుతవిద్యుల్లతికవలెను, ప్రకాశించు స్త్రీ మూర్తిపరుండుటను జూచెను. చూడఁగా సజీవలక్షణంబులు గానరా వయ్యెను, ఆమె సమీపమున నేమియు లేని కరాట మొకటి పడి యుండెను. భవానందుఁ