పుట:Aananda-Mathamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

91


స్థను జూచి కొంచెము విచారముగా నున్నది. మఠమందిరమున వారు లేకున్నచో నగరంబునకుఁ బోయేదను' అని చెప్పి వెడలిపోయెను.


పదునేడవ ప్రకరణము

భవానందుఁడు కల్యాణిని బ్రతికించుట.

భవానందుఁడు మఠమునఁ గూర్చుండి, హరిగుణంబులను గానము చేయుచుండెను. అపుడు ధీరానందుఁడు విష ణ్ణవదనుండై యతఁ డుండిన చోటికి వచ్చెను. భవానందుఁడు, ఏమోయిగోస్వామి ముఖ మేల వాడి యున్నది' అని అడిగెను.

ధీరానంద—— ఏదో తొందరకలిగిన ట్లున్నది. నిన్న వైష్ణవసంతానులు ఎఱ్ఱనిదుస్తుల వారినిఁ జూచిరి. వారు సన్న్యాసు లను వెదకి పట్టుకొనుచున్నారు. సంతాను లనేకులు కావిశాటీలను విడిచిరి. సత్యానంద ప్రభువు లొక్కరుమాత్రము గైరిక వస్త్రమును విడువక నగరాభిముఖులై పోవుచుండిరి. తురకలచేతఁ జిక్కి రేమో చెప్ప లేను,

భవానంద — వారిని పట్టియుంచెడి వీరు లగు బ్లేచ్ఛులు ధరణీలోఁ బుట్ట లేదు. అయినను, నేనొకసారి నగరముదిక్కు పోయి చూచి వచ్చెదను. నీవు మఠమున జూగ్రత్తగా నుండుము,