పుట:Aananda-Mathamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూఁడవ ప్రకరణము

69


తుదకు, ఆమెకంఠము నిస్తబ్ధ మాయెను; నోటనుండి మాట రాలేదు; కన్నులు మూతఁబడెను; అంగము శీతలావృత మయ్యెను.

మహేంద్రుఁడు కల్యాణి 'హరేమురారే' యని చెప్పుచు వైకుంఠమున కేఁగిన దని తెలిసికొని, పిచ్చిపట్టినట్టు ఉచ్చ స్వరముతో కాననమును వికంపితము చేయుచు పశుపక్షులు భయంపడునట్లుగా హో యని యంగలార్చు చుండెను.

ఆసమయమున నెవరో 'హరే మురారే మధు కైటభారే' యని చెప్పుచు, మహేంద్రుని గాఢా లింగనము చేసికొని, మరల 'హరే మురారే మధు కైట భారే' యని ఘోషించిరి.

అపు డనంతుని మహిమచే ననంత మైనయరణ్య మధ్యమునందు అనంతపథ గామిని యైన కల్యాణి సమ్ముఖమునందు లిర్వుకును అనంతుని నామకీర్తనములు బాడుచుండిరి. పశుపక్షులును విషాద మొందెను. పృథ్వి, అపూర్వ శ్హోభామయియై, చరమసంగీతమున కుపయుక్త మైనమందిరముగా నుండెను. సత్యానందుడు, మహేంద్రునిఁ దొడపై నిడికొని కూర్చుండెను.


పదుమూఁడవ ప్రకరణము

మహేంద్రుఁడు కారాగారబద్ధుఁ డగుట

ఇట్లుండఁగా రాజధానియందు మిగుల గడబిడయై కలకత్తానగరమునకు వచ్చుచున్న సర్కారు రూకలను సన్న్యాసులు కోట్టి దోఁచుకొనిపోయి రని ప్రవాదము కలిగెను. అంత రాజా