పుట:Aananda-Mathamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ఆనందమఠము

హరే మురారే మధుకైటభారే
గోపాల గోవిన్ద ముకున్ద శౌరే
హరే మురారే మధు కైటభారే.

మహేంద్రుఁడు కాననమునందు వినఁబడిన స్వరమును, కల్యాణికంఠ స్వరమును విని, విముగ్ధుఁడై తత్తఱపాటుతో 'ఈశ్వరుఁడే సహాయమాత్రుఁడు, వేఱే దిక్కు లేదు' అనెను.

హరే మురే మధుకైటభారే
గోపాల గోవిక్ట ముకుదTV
హరే ముగా రే మధు కైటభారే,

అని పక్షులు సైతము ధ్వని చేయ నారంభించెను.

హరే మురారే మధు కైటభారే.

అని నదీజల ప్రవాహకలలక ధ్వనియందును వినఁబడియెను.

అపుడు మహేంద్రుఁడు శోక తాపములను మఱచి పోయి ఉన్మత్తుడై తానును కల్యాణితోఁ గూడ,

హరే మురారే మధుకై టభారే
గోపాల గోవిన్ద ముకున్ద శౌరే.

అని పాడం దొడంగెను.

కాననంబంతయు వీరికంఠస్వరము ప్రతిధ్వని చేయుచుండెను. క్రమక్రమముగా కల్యాణికంఠస్వరము తగ్గనారంభించెను. అయినను 'హరే మురారే మధుకైటభారే' అని హీనస్వరముతోఁ జెప్పుచుండెను.