పుట:Aananda-Mathamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము

53


మహేంద్ర,——ఆ తల్లి యెవరు?

బ్రహ్మచారి—— సమయము వచ్చినప్పుడు తెలిసికొనెదవు. ఇపుడు "వందేమాతరం” అని చెప్పుము: అనెను.

మహేంద్రసింహుడు “వందేమాతరం” అని చెప్పెను.

అటమీఁద, బ్రహచారి మహేంద్రుని వేఱోకగృహమునకుఁ బిలుచుకొనిపోయెసు. మహేంద్రుఁడు, అపూర్వమై, సర్వాంగ సౌందర్యయై, సర్వాభరణభూషితయై, జగద్ధాత్రియై వెలయు దేవీమూర్తినిం గాంచి, 'యిదేమి?' యనెను.

బ్రహ్మచారి—— మహామాత పూర్వస్థితి.

మహేంద్ర ——అదేమి?

బ్రహచారి —— ఈ దేవి మొదట సింహగజాదివన్య మృగములన్నియు పదతలమునం దొక్కి వన్యపశువాసభూమియందు తన పద్మాసనమును స్థాపించెను. అక్కాలమున సర్వాభరణ భూషితయై, మందహాసవదనయై, మహదైశ్వర్యసంపన్నయై, మహాసుందరియై, బాలార్కారుణవర్ణాభయై ప్రకాశించుచుండెను. ఈమేకు ప్రణామము చేయుము.

మహేంద్రుఁడు, భక్తిభావము చేత జగద్ధాత్రి రూపిణియైన మాతృభూమికి ప్రణామము చేసినపిదప, బ్రహ్మచారి వాని కొక సొరంగమును జూపి ముందు నడిచెను. మహేంద్రుఁడు భయముతోఁ గూడినవాఁడై వెన్నంటిపోయెను. ఆభూగర్భస్థ ఆంధకారమయమైన మందిరమునందు ఎచ్చోటనో కొంచెము వెలుతురు మినుకుమినుకు మని తెలియు చుండెను. ఆ రవంత వెల్తురులో నొక కాళికామూర్తి కనఁబడెను.

బ్రహ్మచారి—— చూడుము, తల్లీయెటు లైపోయియున్నదో