పుట:Aananda-Mathamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము

51


ఆలోకమయ మైనది. పక్షుల కలకలశబ్దము శ్రోత్రానందమై యుండెను. ఆనందమయ మైన కాననమునందలి " ఆనందమఠ"మునందు సత్యానంద ఠాకూరు మృగచర్మా సీనుఁడై ప్రాతస్సంధ్యా వందనము చేయుచుండెను. వానిపొర్శ్వమున జీవానందుఁడు కూర్చుండి యుండెను. ఈసమయమునందు భవానందుడు మహేంద్రసింహునితోఁ బోయి నిలువంబడెను.బ్రహ్మచారి మాటలాడక సంధ్య వార్చుచుండెను.. ఎవరును మాటలాడుటకు ముందు పడలేదు. సంధ్యాహ్నికకృత్యము ముగిసిన మీద, భవానందుఁడును జీవానందుఁడును సాష్టాంగ ప్రణామం బాచరించి వినీత భావముతోఁ గూర్చుండిరి. అపుడు సత్యానందుఁడు భవానందునికి సంజ్ఞ చేసెను. ఇర్వురును బైటపోయి యేమో మాటలాడుచుండిరి. వారిమాటలు మనకుఁ దెలియవు, తర్వాత ఇర్వుకును వచ్చిరి. బ్రహచారి మందహాసవదనుఁడై కరుణ భావముతో మహేద్రునింజూచి, 'అన్నా! నీదుఃఖమునందు నేనును భాగియై యున్నాఁడను, దీనబంధువైన భగవంతునికృపచే నీ భార్యయు బిడ్డయు 'క్షేమముగా నున్నా 'రని వారివృత్తాంతము నంతయుఁ జెప్పి, రమ్ము, వారిని కనఁబఱ చెద' నని నడిచెను. మహేంద్రుఁడు వెంబడిపోవుచుండెను.

ఇర్వురును దేవాలయములోనికిం బోయిరి. పోఁగా మహేంద్రుఁడు విస్తారమైనదియును అత్యున్నతమైనదియు నగు గృహమును జూచెను. ఆ నవారుణోదితమైన ప్రాతఃకాలము నందు సమీపమునం దున్న కాననము సూర్యకిరణములచే వజ్రఖచిత మైనట్టు జ్వలించుచున్నను, విశాలమైన యాగృహము అంధ కారమయముగనే యుండెను. ఆగృహమునం దేమి