పుట:Aananda-Mathamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఆనందమఠము


ఇచ్చట పాఠకమహాశయులు కొంచెము దిజ్ని రూపము చేసికొనవలయును, ఏలన, దిక్కు తెలియక పోయినచో మేము చెప్పెడి వృత్తాంతము నిజమే యైనను దానియందు నమ్మకము కలుగదు. రాజనగరమునుండి కలకత్తాకు పోవలసినచో ముసల్మా౯ రాజులచే నిర్మితమైన బాటమీఁదుగ పోవలయును. మహేంద్ర సింహుఁడు పదచిహ్న గ్రామమునుండి రాజనగరమునకుఁ బోవుటకై , దక్షిణ దిక్కు నుండి ఉత్తరదిక్కునకుఁ బోవుచుండెను. ఇట్లు పోవునపుడే ధనరక్షకులై సిపాయీలను సంధించెను. భవానందుఁడును ఆకొండయొద్దనుండి గ్రామమునకు పోవునపుడు, వాఁడును దక్షిణమునుండి ఉత్తరమునకుఁ బోవలసినవాఁడాయెను. వీఁడును కొంచెము దూరము పోయి కావలయు ననియే ఆసిపాయీలను సంధించెను. సంధించినవాఁడు మహేంద్రసింహునివలెనే వారికి దారివిడుచుటకై యొదిగి నిలిచెను. సిపాయిలు, రాత్రి కాలములో నొక్కఁడొక్కఁడుగా వచ్చి నిలువంబడినందున, వీనిని కూడ దొంగయని భావించి పట్టుకొనిరి.

భవానందుఁడు—— (ముసిముసి నగవుతో) ఎందులకయ్యా!

సిపాయి ——నీవు దొంగముండాకొడుకుగా నున్నావు.

భవానంద—— కావిబట్ట కట్టుకొనియుండుట నీకుఁ గనఁబడ లేదా? నేను బ్రహ్మచారిని; బందిపోటు చేయువా రిట్లుందురా?

సిపాయి——'చాలమంది దొంగ విధవలు బ్రహ్మచారి,సన్న్యాసి వేషములు వేసికొని దొంగలించుచుండుట తెలియదా' అని చెప్పి, తలమీఁద నొక్క దెబ్బ వేసి మెడబటి