పుట:Aananda-Mathamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

33


తురకలలో "పెండ్లికి పేరు) చేయు " డని చెప్పెను. ప్రకృతము నందు "కైది” అని చెప్పవలసియుండెను. దానికి బదులు కై పెక్కియున్నందున 'షాది' అని సాహేబు నోటనుండి వెడలెను. ఆసిపాయీలు “వీనికి పెండ్లి యెట్లు చేసేది? వీనికిని దెబ్బతిన్న సిపొయికిని పెండ్లి చేసేదా, లేక వీనికి యేడనుండి పిల్లను తెచ్చి పెండ్లి చేసేది? ఇదేమొ వింత తీర్పుగా నున్నదే. అయినా వీనిని కాళ్లు చేతులుకట్టి బండిలో పడ వేసికొనిపోదము, సాహేబు వారుమత్తు తిరిగిన మీఁదహుకుం బదలాయింపఁగలరు” అని తమలోఁ దా మాలోచించుకొని మహేంద్ర సింహుని మోకుదారముతో కట్టి బండిమీఁద వేసిరి. మహేంద్రసింహుఁడు ఇందఱతోను జగడమాడిన ప్రయోజన ముండదని తెలిసికొని యూరకుండెను. సాహసము చేసి తప్పించుకొన్నను ఫలమేమి? 'పెండ్లము బిడ్డ పోయినమీఁద జీవితుఁ డై యుండుటకు వానికి సమ్మతము లేదు. సిపాయీలు మహేంద్రసింహుని బండిగూటమునకు భద్రముగా కట్టిరి. అనంతరము, యథాప్రకారము ఇరసాలును తీసికొని మృదు గంభీర మైన నడకతో పోవుచుండిరి.


ఎనిమిదవ ప్రకరణము

సైనికులు పరాభూతు లగుట

బ్రహచారి ఆజ్ఞాప్ర కారము భవానందుఁడు భగవన్నామస్మరణము చేయుచు, మహేంద్రుఁడు నిలిచిన గ్రామము వైపు బయలు దేరెను. ఆ ప్రాంతముననే వానిసమాచారము తెలియవచ్చునని యాలోచించి, ఆమార్గముగాఁ బోయెను,