పుట:Aananda-Mathamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది మూఁడవ ప్రకరణము

223


యులు సకల సంతాన నాశముకొఱకు “హుర్రే! హుర్రే,” యని శబ్దము చేయుచు పర్వతమునుండి దిగిరి. తుపాకులను మోచికొని యతి వేగముగా పర్వతమునుండి పడునట్టి విశాలమైన తటినీ ప్రపాతమువలె దుర్దమనీయమును అలంఘ్యమును అజయ్యమునైన బ్రిటిష్ సైన్యము పలాయనపరులైన సంతాన సైనికులను వెంబడించెను.

జీవానందుఁ డొకసారిమాత్రము మహేంద్రునిఁ గాంచి, "ఈదిన మంత్య కాల మాసన్నమైనవి, రా; ఇచ్చటనే చచ్చి పోవుదము" అనెను.

మహేంద్ర——చచ్చుట కేమి, రణజయ మైనమీఁద చావ వచ్చును. వ్యర్థముగాఁ జచ్చుట వీరధర్మము కాదు.

జీవానంద——నేను వ్యర్థముగనే చచ్చెదను. అయినను, యుద్ధమునఁ జచ్చెదను.

ఇట్లు చెప్పి, జీవానందుఁడు ఒక పార్శ్వంబుగాఁ దిరిగివచ్చి నిల్చి “ఎవరు హరినాముమును నుడువుచు చచ్చుట కిష్టము గలవారో వారు నాతోడ రావచ్చు" నని యఱచి చెప్పెను.

అనేకులు ముందు పడిరి, జీవానందుఁడు వారినిఁ జూచి, “హరిసాక్షిగా ప్రాణము పోయినను వెనుకకుఁ దిరుగుట లేదని శపథము చేయవలయు” ననియెను.

అప్పుడు ముందడుగిడినవారు వెనుకకు మఱలిరి. జీవానందుఁడు, “ఎవరును వచ్చుట లేదా? అట్లయిన నే నొక్కఁడనే పోయెద"ననియెను.

జీవానందుఁడు గుఱ్ఱముమీఁద నే చాలదూరము కొండ నెక్కిపోయి వెనుకనుండిన మహేంద్రునిం బిలిచి, “అన్నా,