పుట:Aananda-Mathamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

ఆనందమఠము


ముగా పర్వతమునుండి దిగివచ్చుటను గాంచి సంతాన సైన్యము భయఁపడెను. చూచుచుండగనే పర్వతశిఖర ప్రదేశంబున నీలాకాశపటమందు ఫిరంగీలతో బారుతీఱిన యింగ్లీషువారి సైన్యము ప్రకాశించెను. ఉచ్ఛస్వరముతో వైష్ణవ సైన్యము.

ఆన్వీక్షకీ త్రయీవార్తా దండనీతి స్త్వమేవచ,
సౌమ్యాసౌమ్యై ర్జగ ద్రూపై స్త్వయై తద్దేవిపూరితమ్,
కాత్వన్యాత్వామృతేదేవి సర్వయజ్ఞమయం వపుః,
వసుధే త్వమేవవిద్యా భక్తిశ్శక్తిశ్చబాహ్వోర్న: ,
జననీద్ర విణం మిత్రం త్వంహి ప్రాణాశ్శరీరే.
వ్వింహిద్యా త్వంహి మాతా త్వంహి ప్రాణా శ్శరీరే,
త్వంహి భక్తిః త్వంహి శక్తిః త్వంహి ప్రాణా శ్శరీరే.

అని గానము చేసెను. అయినను, ఇంగ్లీషువారియొక్క ఫిరంగి గుండ్ల శబ్దమునం దామహాసంగీతశబ్దము మునిఁగిపోయెను. వేలకొలఁది సంతానులు హతాహతులై పర్వతఝరియందు పడిపోయిరి మరల నా ఫిరంగిగుండ్లు, దధీచిఋషి యొక్క వెన్నెముకతోఁ జేయఁబడిన వజ్రాయుధమును ధిక్కరించి, సముద్ర తరంగములను తుచ్ఛము గాఁ జేసి, యాంగ్లేయుల వజ్రాయుధ మనునట్లుగా పరిణమించెను. సుపక్వమై నిలచిన నస్యము కొడవండ్లకుఁ జిక్కినట్లు సంతాన సైన్యము ఖండింప బడి ధరాశాయి యగుట కారంభ మాయెను. పతనళీల మైన శిలా రాశివలె సంతాన సైన్యము పర్వత ప్రదేశమున నుండి 'వెనుకకుఁ దిరుగ నారంభించెను. ఎవ రెచ్చట పాఱిపోయిరో తెలియక పోయేను. జీవానందుఁడును మహేంద్రుఁడును పోవల దని కావించిన ప్రయత్నము వ్యర్థ మాయెను, అపు డాంగ్లే