పుట:Aananda-Mathamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

ఆనందమఠము


యనిది కలదా! అన్నియుఁ దెలియును. ఈదినము మార్గము నందు సిపాయీలయు సంతానులయు అవాంతరము అధికముగా నున్నది, నీవు పదచిహ్నమునకుఁ బోవుటకు సాధ్యముకాదు.

కల్యాణి—— ఏడ్చుట కారంభించెను.

శాంతి, భయ మేమి? మనము మన నయన బాణంబులచే వేలకొలఁది శత్రువుల నైనను గొట్టి వేయఁగలము; రా, పద చిహ్నమునకుం బోవుదము' అనెను.

కల్యాణి, యిట్టిబుద్ధిశాలియైన యాఁడుదాని సహాయముచే స్వర్గమే దొరకినట్లు పొంగి 'నడువుము, నీవెంబడి నే వచ్చెద' ననెను.

శాంతి, ఆకాననమార్గంబున నామెను పిలిచికోని పోయెను.


ముప్పటి తొమ్మిదవ ప్రకరణము

కల్యాణి మహేంద్రు నిఁ జూచుట

శాంతి ఆనందమఠాశ్రమంబునుండి గంభీర మైన రాత్రి కాలమున నగరాభిముఖియై చనునపుడు జీవానందుఁ డాశ్రమ మున నుండెను.

శాంతి జీవానందుని జూచి, “నేను నగరంబునకుఁ బోయి మహేంద్రునిభార్యను పిలిచి కొని వచ్చెదను, నీవు మహేంద్రు నితో నతనిభార్య జీవించి యున్నదని చెప్పు” మని చెప్పి యుండెను.