పుట:Aananda-Mathamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియెనిమిదవ ప్రకరణము

201


టకును సాధ్యము లేదు. భయవిహ్వలయై వడవడ వడంకెను. ఆ వచ్చినవాఁడు చూచిచూచి చాలించి "హరే మురారే" తెలిసికొంటిని; నీవు దురదృష్టవతి యగుకల్యాణి కదా" యనెను.

కల్యాణి భీతయై, 'తా మెవర' రని యడి గెను.

ఆగంతుకుఁడు——నేను నీదాసానుదాసుఁడను; సుందరీ! నాయందు ప్రసన్ను రాలవు కమ్ము.

కల్యాణి, అతి వేగముతో నచటనుండి జరిగిపోయి హోయని యజచి తర్జనగర్జనములు చేసి 'యీ యవమానము చేయు టకా నీవు నన్ను రక్షించినది ? బాగాయె, చూడఁగా బ్రహ్మచారి వేషము, బ్రహ్మచారిధర్మ మిదేనా ! నేను నేఁడు సహాయ రహితను, 'లేకుండినచో నీమూతికి మట్టిగొట్టియుందును' అని కోపగించెను.

ఆ బ్రహ్మచారి, 'ఓ విస్మితవదనా ! నేను పెక్కు దినములుగా నీ శ్రేష్ఠమైన శరీరస్పర్శనమును గోరుచుంటి ' నని వేగ ముగాఁ బోయి కల్యాణిని గాఢాలింగనము చేసికొనెను అప్పుడు కల్యాణి పకపక నవ్వి, 'అయ్యో దుర్మార్గు రాలా! మొదటనే చెప్ప రాదా? నాకు నిదే యవస్థ యని చెప్పరాదా ? ' యనెను.

శాంతి, “ఏమక్కా ! మహేంద్రుని వెదకికొని పోవుచున్నావా?' యని యడిగెను.

కల్యాణి——నీ వేమి యందఱమనస్సును గుర్తెఱింగిన దానవా?

శాంతి—— నేను బ్రహ్మచారిని—— సంతాన సేన కంతయు నధినాయకుఁడను; ఘోరమైన వీరపురుషుఁడను; నాకుఁ దెలి