పుట:Aananda-Mathamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ఆనందమఠము


'జిక్కిన చేఁపలవలె వధింపవలయు' నని యుద్యమించి యుండెను.


ముప్పదినాలుగవ ప్రకరణము

థామస్ యుద్ధము చేయుట.

ఆంగ్లేయుల ఫిరంగిగుండ్లు ఢం-ఢం- శబ్దము చేసెను. ఆ శబ్దము విశాలమైన కాననమును గంపింపఁ జేసి ప్రతిధ్వనిత మాయెను, శబ్దము ఆజయనదీ సోపానమునుండి మఱోక సోపానమునకు విని, యిట్లు నదీముఖముగా దూరముననుండు కాననమును బ్రవేశించి యచ్చటను ఢం-ఢం- అని వినవచ్చెను. సత్యానందుఁ 'డెవరి పటాలమో చూడుఁ' డనియెను. ఆక్షణముననే కొందఱు సంతానులు గుఱ్ఱముల నెక్కి చూచుటకై వెడలిరి. అయినను, వారు కాననమును విడిచి కొంత దూరము పోవునంతలో శ్రావణమాస వర్ష ధారలవలె గుండ్లు వారిపై గురిసెను, వారు గుఱ్ఱములతోఁ గూడ ప్రాణములను విడిచిరి సత్యానందుఁడు దూరముగ నుండి చూచి సంతానులు కొందఱు హతు లైరని తెలిసికొని, మణికొందఱను బిలిచి 'గొప్పవృక్షము నెక్కి చూడుఁ, డని చెప్పుచుండఁగా, జీవానందు డొక గొప్పవృక్షమునెక్కి చెట్టు కొమ్మపై నిలిచి, 'ఇంగ్లీషువారి పటాల' మనెను. సత్యానందుఁడు, 'గుఱ్ఱపుసవారులా? కాల్భములా?' అని యడిగెను.

జీవానంద—— రెండును గలవు.

సత్యానంద——ఎంత?