పుట:Aananda-Mathamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది మూడవ ప్రకరణము

173


విహితవహిత్ర చరిత్రమఖేదమ్
కేశవధృత మీన శరీర
జయ జగదీశ హరే

అని పాడిరి.

సత్యానందుఁడు వారిని మరల దీవించి, 'సంతానులారా! ఈదినము మీకుఁ జెప్పవలసిన విశేష మొకటి కలదు. థామసుఁ డను నొక విధర్మి యగు దురాత్ముండు అనేక సంతానులను నాశము జేసి యున్నాఁడు. మనము, ఈ రాత్రి వానిని సైన్య సహితముగా హతము చేయవలయును. ఇది జగదీశ్వరుని యాజ్ఞ, మీరేమనెదరు? ' అనెను.

భీషణమగు హరిధ్వనిచే కానన మంతయు విదీర్ణమయ్యెను. “ఇపుడేకొట్టెదము, వాఁ డెచ్చట నున్నాఁడు ! చూపుడు, పదండి, కొట్టుఁడు ! కట్టుడు ! శత్రువును గొట్టుడు !'అనెడి శబ్దములు దూరముగ నుండిన కొండలయందుఁగూడ ప్రతి ధ్వనిత మాయెను. అపుడు సత్యానందుఁడు 'మనము కొంచెము తాల్మితో పని చేయవలయును, శత్రువులకు ఫిరంగి మొదలగు సాధనములు గలవు. అట్టి సాధనములు లేక మనము వారితో యుద్ధము చేయఁ దగదు. ఇదియును గాక, వారు వీరజాతివారు. పద చిహ్నదుర్గమునుండి పదునేడు ఫిరంగీలు వచ్చును. అవి రాగానే మనము యుద్ధంబునకుఁ బోదము. చూడుఁడు, ఇపుడే తెల్లవాఱుచున్నది. అయిదు గంటలు కాకమునుపే——అదియేమి యనెను.

ఢం-ఢం అకస్మాత్తుగా ఆ విశాలమైన యడవియందు నాల్గు దిశ లందును ఫిరంగిగుండ్ల శబ్ద మాయెను. అవి ఆంగ్లే యుల ఫిరంగి గుండ్లు, కేష్ట౯ థామసు సంతానులను 'వలలోఁ