పుట:Aananda-Mathamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

135


జీవానంద—— అచ్చటికి స్త్రీలు పోరాదు.

శాంతి——నేని స్త్రీని కాదు గదా?

జీవానంద—— నేను స్వామియాజ్ఞ నుల్లంఘింపఁజాలను.

శాంతి—— నాకు స్వామియాజ్ఞ యై యున్నది. కుంజమునకు బోయిన పిదప నంతయుఁ జెప్పెదను. నే నింటికిఁ బోవక గడ్డమును మీసమును తీయను. గడ్డమును తీయకుండినచో నీ పాడుమూతి దానిని నీవు గుర్తింపపు, ఛీ ! పురుషజాతి యెటువంటిది!


ఇరువదియాఱవ ప్రకరణము

సంతానులు తమపరాక్రమమును జూపుట,


కడచిన డెబ్బదియాఱవ సంవత్సరము సంపూర్ణ మాయెను. బంగాళా దేశమునందు నాల్గుపాళ్లో యెనిమిది పాళ్లో లేక యెన్ని కోట్లజనులో దాని నెవరు చెప్పఁగలరు? ఎందఱనో యమపురికిఁ బంపి వేసి యాదుర్వత్సరము తానును కాలగ్రాస మొందెను. డెబ్బది యేడవసంవత్సరమున దేవుఁడు సుప్రసన్నుఁ డాయెను, సువృష్టి కలిగెను. పృథ్వి సస్య శాలిని యాయెను. జీవ మాత్రావశిష్టులు కడుపు నిండుగ భుజించిరి. అనాహారులై యుండినవారును, అల్పాహారులై యుండిన వారును, పూర్ణాహారము నొక్క టేసారి తిని, యఱిగించుకొన లేక మృతులైరి. పృథ్వి సస్యశాలిని యాయెనుగాని, జనశూన్యము, గ్రామం