పుట:Aananda-Mathamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఆనందమఠము


శాంతి—— స్త్రీ పేరు చెప్పియుండుటవలన వైష్ణవులు కొంచెము ప్రయాసపడిరిగాని, వెనుకకు రాఁ జాలరు. వలదనినచో వెనుకకు మఱలివచ్చునట్లు చేసేదను.

ఇట్లని చెప్పి శాంతి గోసాయీలను బిలిచి 'తాము కొంచె మాలోచింపవలయును. ఒక వేళ భూత ప్రేతపిశాచములై యుం డినను ఉండవచ్చును. వానిమాయ చే నిట్లగుటయు కల' దనెను.

దీనిని విని గోసాయీలలో నొకఁడు 'ఇది సరియైనమాట సందేహము లేదు. లేకుండినచో స్త్రీ, యెక్కడనుండి వచ్చె ననియెను.

గోసాయీ లందఱు నదే యభిప్రాయము కలవా రైరి. భౌతికమాయ యని యనుకొని యందఱును తమతమ నెలవులకుం జనిరి.

జీవానంద——రా, యిచ్చటనే గూర్చుందము. ఇదంతయు నాకుఁ దెలియఁ జెప్పుము. నీవిచ్చటి కెట్లు వచ్చితివి? ఎందు లకై వచ్చితివి? ఈ వేషమేల ఇంత చమత్కారము లెక్కడ నేర్పితివి?

శాంతి—— నేను నీకొఱకే వచ్చితిని. ఎట్లువచ్చితి నందువా నడిచియే వచ్చితిని, ఈ వేష మేలయందువా ! నాయిష్టము. ఇంత చమత్కారము నెచట నేర్చితి ననఁగా, ఒక పురుషుని యుద్ధ నేర్చితిని. ఇదంతయు సవిస్తరముగాఁ జెప్పెదను. ఈ యడవియం దేల కూర్చుండి యుండవలయును? నీ లతాకుంజc,బునకుఁ బోదము రమ్ము, అని పిలిచెను.

జీవానంద—— నాకు కుంజ మెక్కడిది ?

శాంతి—— మఠమందు,