పుట:2015.393685.Umar-Kayyam.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ఉమర్ ఖయ్యామ్

398

వెలఁదితోఁగూడ సురఁద్రావి, ప్రియులఁగూడి,
యరుల నిర్జించి, యేసుందరాంగినో వ
రించి, మమకారపదము వర్జించి, గర్వ
మనెడు నంగీని దీయుమీ తనువునుండి.

399

నేను సురాపానము విష
యానందముకొఱకుఁ జేయ నమలమత శ్రీ
పోనాడఁజేయఁ బరవశ
మూని ప్రమత్తమతిఁ గాలమును బుచ్చుటకే.

400

మానసికంబు లౌవగలమానుము ; జీవితవాంఛ యోగిచం
దానఁ బరిత్యజించి ఘనతాపస ముఖ్యసభాంతరంబు లా
స్థానముగా వసింపుము ; స్వతంత్రత గల్గి చరింపు ; మా సురా
పానము చేసి సంతసము పారముముట్టఁగ నుండు మెప్పుడున్.

401

ఈసురను నా "ఖిజరు" గౌరవించె, నమృత
మనెను దీనిగడు "నిలియాస్" ప్రవక్త ;
యసుల కాహార మిది ; హృదయ బలకారి
నరుల కిది లాభ మనుచు నీశ్వరుఁడు పలుకె.